కుంభరాశిలో శని తిరోగమనం.. 20వారాలు ఈ రాశులవారికి దినదిన గండం!!
వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. క్రమశిక్షణకు మారుపేరైన శనిగ్రహం ఈ సంవత్సరం మొత్తం కుంభరాశి లోనే ఉంటాడు. శని గ్రహం 18 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. తన సొంత రాశి అయిన కుంభరాశిలో శని గ్రహ గమనం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది.
కుంభరాశిలో శని తిరోగమనం
ముఖ్యంగా హిందూ క్యాలెండర్ ప్రకారం జూన్ 29వ తేదీ నుంచి శని కుంభరాశిలో తిరోగమనంలో ఉంటాడు. 139 రోజులపాటు అంటే దాదాపు 20 వారాలు శని తిరోగమనంలోనే కుంభరాశిలో సంచరిస్తాడు. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. 20వారాలు ఈ రాశులవారికి దినదిన గండంగా ఉంటుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేష రాశి
శని తిరోగమనం వల్ల మేష రాశి జాతకులకు పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వర్తక వ్యాపారాలలో ఒడిదుడుకులు వస్తాయి. మేష రాశి వారికి మానసిక అశాంతి కలుగుతుంది. ఆర్థికపరమైన లావాదేవీలలో అతిగా నమ్మడం అనర్ధాలకు దారితీస్తుంది. గతాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో ఎటువంటి భావోద్వేగాలకు లోను కావద్దని సూచన.
మిధున రాశి
శని తిరోగమనం కారణంగా మిధున రాశి వారికి కష్టాలు వస్తాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. పనిలో శ్రమ అధికమవుతుంది. ఈ సమయంలో శత్రువులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పడకూడదు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.
కన్యా రాశి
శని తిరోగమన కారణంగా కన్యా రాశి వారి జీవితంలో ఇబ్బందులు వస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు చోటుచేసుకుంటాయి. విపరీతంగా ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సంబంధాలలో విభేదాలు పెరుగుతాయి. సహోద్యోగులతో గొడవలు వస్తాయి. ఈ సమయంలోనే తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరితోనూ ఎటువంటి గొడవలు లేకుండా జాగ్రత్తగా సంబంధాలను కొనసాగించాలి.
ధనుస్సు రాశి
కుంభరాశిలో శని తిరోగమన ధనస్సు రాశి వారికి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెడతాయి. మానసిక అశాంతి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులలో పడకుండా ఉండాలని సూచించబడింది. పనిచేసే చోట ఉద్యోగులతో విభేదాలు మంచిది కాదు. ఆర్థిక విషయాలలో ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. డబ్బులు తెలివిగా ఖర్చు పెట్టాలి. సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దిగకుండా జాగ్రత్తపడాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
కుంభరాశి
కుంభరాశిలో శని తిరోగమనం కుంభరాశి జాతకులకు కష్టాలను తెస్తుంది. కుంభరాశి జాతకులు చేసే పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. పనుల్లో జాప్యం పెరుగుతుంది. ఈ సమయంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బుకి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. బడ్జెట్ పైన ఎప్పుడు శ్రద్ధ వహించాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications