కుంభరాశిలో శని తిరోగమనం; జూన్ నుండి ఈ రాశులవారికి సమస్యలు షురూ!!

శని దేవుడు న్యాయనిర్ణేత. సహనాన్ని ఇచ్చే దేవుడు. జ్యోతిష్య శాస్త్రంలో శనికి ఒక ముఖ్యమైన స్థానం ఉంది. శని గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి ప్రయాణం చేయడానికి రెండున్నర సంవత్సరాల టైం పడుతుంది. అయితే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి శని ప్రయాణం ఆయా జాతకుల జీవితాలలో పెను మార్పులకు కారణమవుతుంది.

వచ్చే జూన్ మాసంలో శని కుంభ రాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. దీనివల్ల 4 రాశుల వారు తీవ్రంగా ప్రభావితం అవుతారు. శని కేవలం కష్టాలను కలిగించే దేవుడు మాత్రమే కాదు, ధనాన్ని వృద్ధిని, సంతోషాన్ని కూడా ఇచ్చి ఆశీర్వదించే దేవుడు. అయితే శని ప్రతికూల ఫలితాలను ఇస్తే మాత్రం ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది.

kumba

కుంభ రాశిలో శని తిరోగమనం అన్ని అశుభ ఫలితాలను ఇవ్వదు. అలాగని శుభ ఫలితాలను ఇవ్వదు. మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అయితే శని తిరోగమన సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించ వలసిన అవసరం ఉంది. అతిగా ఖర్చు పెట్టడం, ఏదైనా కొత్త ప్రాజెక్టును ప్రారంభించడం, ఏవైనా వ్యాపారానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం ఈ సమయంలో చేయకుండా ఉండాలి.

కుంభరాశిలో శని తిరోగమనం జూన్ 17వ తేదీ 2023న జరుగుతుంది. రాత్రి 10:48 నిమిషాలకు శని తిరోగమనాన్ని ప్రారంభించి ఐదు నెలల పాటు తిరోగమనం లోనే ఉంటుంది. నవంబర్ 4వ తేదీ ఉదయం 8:26 నిమిషాల వరకు శని తిరోగమనంలోనే ప్రయాణం చేస్తుంది. కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల మేషరాశి, కర్కాటక రాశి, తులా రాశి, కుంభ రాశి జాతకులు జీవితాలలో పెను మార్పులు సంభవించబోతున్నాయి.

వీరు తీవ్రమైన ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల కుంభ రాశి జాతకులకు మానసిక ఒత్తిడి కలుగుతుంది. ఈ సమయంలో తక్షణం నిర్ణయాలు తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా జాగ్రత్త వహించాలి.కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల తులా రాశి లో జన్మించిన వ్యక్తులకు అనుకూలంగా ఉండదు.

kumba

తులా రాశివారు ఉద్యోగ, వ్యాపారాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. తల్లి ఆరోగ్యం పై ముఖ్యంగా శ్రద్ధ వహించాలి. కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల మేష రాశి వారికి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. మానసిక, శారీరక ఒత్తిడి పెరుగుతుంది. కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల కర్కాటక రాశి వారికి కష్టానికి తగిన ఫలితం ఉండదు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+