నవంబర్ 28 వరకు వీరే కింగ్స్.. శనిదేవుడి మహత్యం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. నవగ్రహాలలో శని దేవుడిని అత్యంత ముఖ్యమైన గ్రహంగా చెప్పవచ్చు. శని దేవుడు నిదానంగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు. శనిసంచారం సమయంలో అన్ని రాశుల వారిపైన తనదైన ప్రభావాన్ని చూపిస్తాడు. జాతకంలో శని శుభ స్థానంలో ఉంటే శుభ ఫలితాలను, అశుభ స్థానంలో ఉంటే అశుభ ఫలితాలను ఇస్తాడు.
శని తిరోగమనం
అటువంటి శని దేవుడు ప్రస్తుతం తిరోగమనంలో సంచరిస్తున్నాడు సంచారం ప్రభావితం చేస్తుంది . జూలై 13వ తేదీ నుంచి శని దేవుడు తిరోగమన సంచారం మొదలుపెట్టి నవంబర్ 28 వరకు తిరోగమనము లోనే సంచరించనున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

కర్కాటక రాశి
శని తిరోగమన సంచారం కర్కాటక రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో ప్రయోజనాలను పొందుతారు. ఏ పని చేసిన లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పటి నుండో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. శని తిరోగమన సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
మిధున రాశి
నవంబర్ 28వ తేదీ వరకు శని తిరోగమన సంచారం మిధున రాశి వారికి శుభాలను చేకూరుస్తుంది. మిధున రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన శక్తివంతంగా పూర్తి చేస్తారు. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిధున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అన్ని విధాల ఈ సమయంలో వీరికి లాభదాయకంగా ఉంటుంది.
మకర రాశి
నవంబర్ 28వ తేదీ వరకు శని తిరోగమన సంచారం ఫలితంగా మకర రాశి జాతకులు అనేక శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మకర రాశి వారికి శని దేవుడు కారణంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మకర రాశి జాతకులు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడానికి సానుకూలంగా ఉంటుంది .ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఇది అన్ని విధాల మకర రాశి వారికి శుభ సమయం.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications