అస్తమించి రెండు నెలలు వీరి వెంటపడతానని శపథం చేసిన శని.. జాగ్రత్త!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా జరుగుతుంది. కొన్నిసార్లు గ్రహాలు సాధారణంగా సంచరిస్తే కొన్నిసార్లు తిరోగమనంలో సంచరిస్తాయి. కొన్నిసార్లు వక్రమార్గంలో, అష్టమానంలో సంచరిస్తాయి. గ్రహాల స్థానాలలో ఏదైనా మార్పు ఉంటే దాని ప్రభావం ద్వాదశ రాశుల వారిపైన కనిపిస్తుంది. ప్రస్తుతం గ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహంగా క్రమశిక్షణకు మారుపేరుగా భావించే శని తన మూల త్రికోణ రాశి అయిన కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు.
కుంభరాశిలో శని అస్తమయం
కుంభ రాశిలో శని సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి లబ్ది జరిగితే మరికొన్ని రాశుల వారికి అశుభాలు జరుగుతాయి. కుంభరాశిలో సంచరిస్తున్న శని ఫిబ్రవరి 28వ తేదీన అస్తమించనున్నాడు. అష్టమ స్థానంలో శని అస్తమయం ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అశుభాలు కలుగుతాయి. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
శని అస్తమించడం వల్ల మేష రాశి వారికి ఇబ్బందులు తప్పవు. మేషరాశి జాతకులకు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.తలనొప్పి, నిద్రలేమి, రక్తపోటు వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తలెత్తుతాయి. కార్యాలయంలో పై అధికారులతో వివాదాలు, విభేదాలు పెరుగుతాయి. ప్రమోషన్ల లో జాప్యం జరుగుతుంది.
వృషభ రాశి
శని అస్తమించటం కారణంగా వృషభ రాశి జాతకుల ఇంట్లో విభేదాలు, అశాంతి పెరుగుతుంది. వృషభ రాశి వారి కుటుంబ కలహాలు పెరుగుతాయి. కంటికి సంబంధించి ఏదైనా అనారోగ్య సమస్య వస్తుంది. ఆర్థిక నష్టం కలుగుతుంది. అప్పులు పెరిగే అవకాశం ఉంది. పనిలో ఆకస్మిక అంతరాయం కలుగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో ఆరవ స్థానంలో శని అస్తమయం జరుగుతున్న కారణంగా కర్కాటక రాశివారు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కర్కాటక రాశి వారు డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకపోతేనే మంచిది. వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో గొడవలు పడకుండా ఉండాలి. సాధ్యమైనంత వరకు నగదు లావాదేవీలను ఎక్కువ చేయడం నివారించాలి. ఇది రిస్క్ తీసుకునే సమయం కాదు.
సింహరాశి
సింహరాశిలో ఏడవ స్థానంలో శని అస్తమించడం వల్ల ఈ రాశి వారికి అనేక కొత్త సమస్యలు వస్తాయి. ఈ కాలంలో ఈ రాశి వారు ఎవరిని నమ్మకూడదు. పొరపాటున ఎవరినైనా నమ్మితే పెద్ద నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు పని భారాన్ని చూస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపలేరు. అనేక అనారోగ్య సమస్యలతో బాధపడతారు.
మీన రాశి
మీనరాశిలో 12వ స్థానంలో శని అస్తమించడం వలన మీన రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ సమయంలో విజయాలు సాధించేందుకు గట్టిగా కృషి చేయాలి. గట్టి కృషి చేయకుంటే ఫలితం కష్టమే. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా డబ్బు ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉన్నందున జాగ్రత్త.
మకర రాశి
శని అస్తమయం కారణంగా మకర రాశి వారికి కష్టాలు ఎదురవుతాయి. మకర రాశి వారు శని ప్రత్యేక దృష్టి కారణంగా బాధితులుగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో మకర రాశి వారికి ఆర్థిక నష్టాలు చేకూరుతాయి. అనవసరమైన సమస్యలు వస్తాయి. ఆరోగ్యం పైన కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications