త్వరలో పులిపంజా చీల్చి కోటీశ్వరులయ్యే రాశులు వీరేనన్న శనిదేవుడు!
క్రమశిక్షణను, సహనాన్ని నేర్పే దేవుడైన శని దేవుడు పూర్వభద్ర నక్షత్రంలోకి ప్రయాణం చేస్తున్నాడు. శని దేవుడు తొమ్మిది గ్రహాలలోను నీతిమంతుడు అయిన గ్రహం. మనం చేసే పనిని బట్టి మన ప్రతిఫలాలను ఇచ్చే శని దేవుడు న్యాయదేవతగా గుర్తింపు పొందాడు. అటువంటి శని దేవుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మాత్రమే కాదు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలోకి కూడా సంచారం చేస్తాడు.
శని సంచారం
అతి నెమ్మదిగా ప్రయాణించే గ్రహమైన శని దేవుడు రెండున్నర సంవత్సరాల కాలం ఒకే రాశిలో ఉంటాడు. ప్రస్తుతం కర్మ వీరుడు అయిన శని దేవుడు 30 సంవత్సరాల తర్వాత తన సొంత రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. 2025లో ఆయన తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు.

పూర్వాభాద్రలోకి శని సంచారం
ఇక డిసెంబర్ నెలాఖరులో డిసెంబర్ 27వ తేదీన శని పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. శని పూర్వాభాద్ర నక్షత్ర సంచారం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే కొన్ని రాశులకు మాత్రం ఇది లబ్ధిని చేకూరుస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం
వృశ్చిక రాశి
పూర్వభాద్ర నక్షత్రంలో శని సంచారం వృశ్చిక రాశి వారికి సంతోషం కలిగిస్తుంది. ఈ సమయం వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుంది ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. పై అధికారుల మన్ననలు లభిస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. అవివాహితులకు వివాహాలు జరుగుతాయి. బంధువులతో లబ్ధి చేకూరుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మకర రాశి
శని నక్షత్ర సంచారం కారణంగా మకర రాశి జాతకులకు ఏ పని చేసిన సానుకూల ఫలితాలు వస్తాయి. 2025 ప్రారంభం మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు విజయవంతం అవుతాయి. స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ సమయం మీరు శుభవార్తలు వినే సమయం. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి.
వృషభ రాశి
శని నక్షత్ర సంచారం వృషభ రాశి వారికి అనేక యోగాలను తీసుకువస్తుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. వృషభ రాశి జాతకులు పై అధికారుల మన్ననలు పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. ఇంక్రిమెంట్లు వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అవివాహితులు వివాహం చేసుకుంటారు. ప్రేమ జీవితం ఆనందంగా గడుపుతారు. ఇది 2025 సంవత్సరంలో మీకు గొప్ప ప్రారంభాన్ని ఇస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications