దీపావళికి శని ఈ రాశులవారింట సిరులు కురిపిస్తాడు.. రాసి పెట్టుకోండి!

గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తుంటాయి. ఇటువంటి సమయంలో గ్రహాలు మరొక గ్రహం తో కలిసి కొన్ని శుభ యోగాలను, అశుభ యోగాలను కూడా ఏర్పరుస్తాయి. ప్రస్తుతం అక్టోబర్ మాసంలో ముఖ్య గ్రహాలు కదలిక చాలా రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. గ్రహాలు అన్నిటిలోకి ముఖ్యమైన గ్రహంగా చెప్పుకునే శని చాలా నిదానంగా రాశిని మార్చుకుంటాడు.

దీపావళికి శని సంచారం.. ఈ రాశులకు అదృష్టం
రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని రాశి మార్పు జరుగుతుంది. శనిని కర్మ దేవుడిగా, క్రమశిక్షణను నేర్పేవాడు గా చెబుతారు. అటువంటి శని దేవుడు ప్రస్తుతం మీనరాశిలో తిరోగమనంలో సంచారం చేస్తున్నాడు. అక్టోబర్ 20వ తేదీన శని దేవుడు చేసే సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Saturn will shower blessings on these zodiac signs on Diwali

వృషభ రాశి
మీన రాశిలో శని తిరోగమన సంచారం వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఊహించని ధన లాభాలను పొందుతారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. సంతోషం కలుగుతుంది. ఈ రాశి జాతకులు ఈ సమయంలో డబ్బులు బాగా సంపాదిస్తారు. కెరీర్లో ఊహించని మార్పులు ఉంటాయి.

మిధున రాశి
మీనరాశిలో శని తిరోగమన సంచారం మిధున రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు ఆర్థికంగా లాభాలను పొందుతారు. ఉద్యోగం లేని వారికి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసేవారు ముఖ్యంగా ఇనుము, నూనె, మొదలైన నల్లటి వస్తువులను అమ్మే వారికి బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తారు.

మకర రాశి
మీన రాశిలో శని తిరోగమన సంచారం మకర రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులు వర్తక వ్యాపారాలలో లాభాలను చూస్తారు. కెరీర్ లోను సానుకూల ఫలితాలు వస్తాయి. కొత్త ఇంటిని, ఆస్తులను కొనుగోలు చేస్తారు. మకర రాశి వారి వైవాహిక జీవితం బాగుంటుంది.

కుంభరాశి
శని తిరోగమన సంచారం కుంభ రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. కుంభరాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. దీపావళి నుండి కుంభరాశి వారు సంతోషంగా ఉంటారు. వీరి ఆదాయం పెరుగుతుంది. వివిధ మార్గాల నుండి డబ్బులు సంపాదించే వీలుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+