12నెలల తర్వాత నేడు గురుశుక్రులతో షడష్టక యోగం.. ఈ రాశులవారికి కుబేర కటాక్షం!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దేవతల గురువైన బృహస్పతి ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని మార్చుకొని వేరొక రాశిలోకి సంచారం చేస్తాడు. ప్రస్తుతం మిధున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి తిరోగమనంలో వెళుతున్నాడు. జూన్ 2026 వరకు మిధున రాశి లోని బృహస్పతి సంచారం కొనసాగుతుంది. బృహస్పతి ఇతర గ్రహాలతో కలిసినప్పుడు కొన్నిసార్లు శుభ యోగాలను కొన్నిసార్లు అశుభ యోగాలను ఏర్పరుస్తారు.
షడష్టక దృష్టి యోగం
డిసెంబర్ 19వ తేదీన బృహస్పతి ఉదయం 7 గంటల 12 నిమిషాలకు శుక్రుడికి 150 డిగ్రీల దూరంలోకి వచ్చి షడష్టక దృష్టి యోగాన్ని ఏర్పరుస్తున్నాడు . మూడు రాశుల వారికి దీని కారణంగా శుభ ఫలితాలు రానున్నాయి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేష రాశి
మేషరాశిలో షడష్టక యోగం వీరికి అనేక విధాలైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారికి దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. నూతన ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. బృహస్పతి దయవల్ల మేష రాశి వారి కెరీర్ కూడా బాగుంటుంది. మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో విజయాలను సాధించవచ్చు. వ్యాపారంలో లాభం పొందే అవకాశం ఉంది. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు షడష్టక యోగం అదృష్టాన్ని ఇస్తుంది. కర్కాటక రాశిలో గురువు రెండో ఇంట్లో, శుక్రుడు 5 ఇంట్లో ఉండడం వలన ఈ రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. వీరు అన్ని రంగాలలోనూ గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. జీవితంలో దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఎంతోకాలంగా ఉన్న కుటుంబ సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. సంతోషం పెరుగుతుంది. భవిష్యత్తు కోసం డబ్బులు ఆదా చేయగలుగుతారు.
ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి గురు శుక్ర షడష్టక యోగం శుభ ఫలితాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశిలో 12వ ఇంట్లో శుక్రుడు, ఏడవ ఇంట్లో బృహస్పతి ఉంటారు. ఫలితంగా ఈ రాశి వారు అనేక రంగాలలో ప్రయోజనాలను పొందుతారు. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వర్తక, వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో కూడా ధనుస్సు రాశి వారు ఉత్సాహంగా ఉంటారు.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications