హోలీకి ముందు శని, శుక్రుల అరుదైన కలయిక.. ఈ రాశులవారికి లాభాలు!
జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారమే అన్ని రాశుల వారి జీవితాన్ని నిర్ణయిస్తుంది. గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం చేస్తూ వివిధ రాశుల పైన సానుకూల ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో నాలుగవ తేదీన హోలీ పండుగను జరుపుకుంటాము.
హోలీకి ముందు శుక్రుడు మరియు శని సంయోగం
హోలీ పండుగకు ముందు శుక్రుడు మరియు శని మార్చి రెండవ తేదీన సంయోగం చెంది ఈ శుక్ర శని సంయోగం కారణంగా కొన్ని రాశుల జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. వీరికి ఈ సమయంలో అన్ని విధాలా లబ్ది జరుగుతుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మిధున రాశి
శని మరియు శుక్రుల కలయిక కారణంగా మిధున రాశి జాతకులు అదృష్టాన్ని చూస్తారు. ఈ కలయిక మిధున రాశిలో కర్మ భావంలో ఏర్పడడం వల్ల మిధున రాశి వారికి పనిలోనూ వ్యాపారంలోనూ పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి .వ్యాపారవేత్తలు గణనీయమైన ఆర్థిక లాభాలను చూస్తారు. వారి వ్యాపారాలు విస్తరిస్తాయి.
వృషభ రాశి
శని మరియు శుక్రుల కలయిక వృషభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సంయోగం వృషభ రాశి యొక్క సంచార చార్ట్ లో ఆదాయం మరియు లాభ గృహంలో జరుగుతుంది. దీనివల్ల వృషభ రాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది. నూతన ఆదాయ వనరులు ఈ సమయంలో కనిపిస్తాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. పాత పెట్టుబడుల నుండి ప్రయోజనాలు పొందుతారు.
మీన రాశి
శుక్రుడు మరియు శని కలయిక కారణంగా మీనరాశి జాతకులు లబ్ధిని పొందుతారు. ఈ కలయిక మీన రాశిలో లగ్న గృహంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో మీన రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. సమాజంలో గౌరవ, మర్యాదలు లభిస్తాయి. మీనరాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీన రాశి వారికి అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇచ్చే కలయిక.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications