19ఏళ్ళు ఈ రాశులవారికి మహారాజయోగం పట్టించనున్న శని మహాదశ!

నవగ్రహాలలో శని గ్రహం చాలా నెమ్మదిగా కదులుతుంది. శని గ్రహం ఒక రాశిలోకి ప్రవేశిస్తే దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ రెండు సంవత్సరాల పాటు శని ఆ రాశుల వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తాడు.. కొన్ని రాశుల వారికి శని అనుకూలమైన ప్రయోజనాలను ఇస్తే కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రయోజనాలను ఇస్తాడు.

19 ఏళ్ళపాటు శని మహాదశ
అయితే ఎవరి జీవితంలో అయితే శనీశ్వరుడు ఉచ్చ స్థితిలో ఉంటాడో వారికి శని మహాదశ పడుతుంది. వారికి శనీశ్వరుడు అద్భుతమైన ప్రయోజనాలను అందించి వారిని అన్ని విషయాలలో రాణించేలా చేస్తాడు. ఇక శని మహాదశ ఉన్న వ్యక్తులు సుమారు 19 సంవత్సరాల పాటు శని దేవుడి దయ వల్ల అన్ని విధాలుగా ఉన్నత స్థితిని చూస్తారు. ప్రస్తుతం శని మహాదశలో ఉన్న రాశుల గురించి తెలుసుకుందాం.

Shani Mahadasha will bring Maharaja Yoga for 19 years to these zodiac signs

కన్యారాశి
శని మహాదశ వల్ల కన్యా రాశి వారికి గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రాశుల వారు శని భగవానుడు ఆశీర్వాదంతో అన్ని విధాలుగా రాణిస్తారు. సంపన్నులుగా మారతారు. కన్యా రాశి వారు చేసే పనులు విజయాలను సాధిస్తాయి. శని మహాదశ కాలంలో కన్యా రాశి వారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వీరికి డబ్బుకు లోటు ఉండదు. భారీగా డబ్బు వచ్చి పడుతుంది. శని మహాదశ సమయంలో తిరుగులేని వారిగా నిలుస్తారు.

ధనస్సు రాశి
శనీశ్వరుడు ఈ రాశికి చెందిన రెండు, మూడు స్థానాలకు అధిపతిగా ఉంటాడు. దీని కారణంగా శని మహాదశ కాలంలో ధనస్సు రాశి వారికి అన్ని విధాలుగా మంచి ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశి జాతకులు శని మహర్దశ కాలంలో ఏ పని చేసినా కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు శని ఆశీర్వాదంతో వారి వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది. జీవితంలో సంతోష క్షణాలను గడుపుతారు. వ్యాపారులు లాభాలను పొందుతారు.

తులారాశి
తులారాశిలో శనీశ్వరుడు 4, 5వ స్థానాలకు అధిపతిగా ఉంటాడు. దీని కారణంగా తులా రాశి వారికి శని మహాదశతో మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధిస్తారు. ఈ సమయంలో డబ్బులు బాగా సంపాదిస్తారు. ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎటువంటి గందరగోళం లేకుండా స్పష్టమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఈ నిర్ణయాల ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ నిర్ణయాలే ఈ రాశి వారిని ఉన్నత స్థానాలకు చేరుస్తాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+