ఈ 5రాశులపై శని విజృంభిస్తున్నాడు.. నేడు శని జయంతి పూజలే శరణ్యం!!
జూన్ 6 వైశాఖ అమావాస్య. శనీశ్వర జయంతి మరియు పంచగ్రహ కూటమి. చాలా శక్తివంతమైన రోజు. నేడు ఏ రాశి వారైనా ఏ జాతకం వారైనా శని భగవానునికి తైలాభిషేకం మరియు ఇతర గ్రహాలకు అభిషేకములు అర్చనలు చేయించుకోవడం వల్ల జాతక రీత్యా, గ్రహచార రీత్యా ఉన్న గ్రహ దోషాలన్నీ తగ్గి అనుకూల శుభ ఫలితాలు కలుగుతాయి.
శనీశ్వర జయంతి.. జాతకంలో శని దోషముంటే నేడే ఉపశమన అవకాశం
ఏటా వైశాఖ అమవాస్య తిథినాడు శనీశ్వరుడి జయంతి నిర్వహిస్తారు. ఈ సంవత్సరం నేడు శనీశ్వర జయంతి వచ్చింది. ఈ రోజు శనీశ్వరుడిని ఈ క్రింది రాశుల వారు అర్చన, అభిషేకం చేయించుకోవటం మంచిది. జాతక చక్రములో ఏలినాటి, అర్ధాష్టమ, అష్టమ శని ఇలా జాతకంలో ఏ దోష ప్రభావం ఉన్నా దాని నుంచి కొంత ఉపశమనం పొందాలంటే శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందడమే ఏకైక మార్గం.

శని ప్రభావం తీవ్రంగా ఉన్న రాశులకు అలెర్ట్
ఇందుకోసం శాస్త్రాల్లో పేర్కొన్న చిన్నపాటి తరుణోపాయాలను తప్పక పాటించాలి. అయితే శని ప్రభావం దారుణంగా, తీవ్ర ప్రతికూలంగా ఉన్న రాశుల వారు తప్పక శని జయంతి నాడు శనిదేవుడిని పూజించాలి. శని ప్రతికూలతల నుండి కాపాడుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆ రాశులేమిటో వారిపై శని ప్రభావం ఏమిటో చూద్దాం.
ఈ ఐదు రాశులవారిపై శని ప్రభావం ఇలా
కుంభ రాశి వారికి ఏలినాటి శని కొనసాగుతోంది. ఇంకా 4 ఏళ్ళపాటు ఉంటుంది. మీన రాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది. మకర రాశి వారికి 2025 వరకు ఏలినాటి శని ఉంటుంది. వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని 2025 మార్చి వరకు ఉంటుంది. కర్కాటక రాశివారికి అష్టమ శని 2025 మార్చివరకు ఉంటుంది.
శని జయంతి నాడు ఇలా చేస్తే శని అనుగ్రహం
కనుక ఈ ఐదు రాశుల వారు శని జయంతి నాడు శనిని ప్రసన్నం చేసుకునే పూజలతో పాటుకొన్ని దానాలు చేస్తే మంచిది. గ్రహాలలో అత్యంత ప్రధానమైన గ్రహాం అందర్నీ ఎక్కువగా అనుగ్రహించే గ్రహం ఎక్కువగా భయపెట్టే గ్రహం కూడా శని దేవుడే. శని జయంతి మహోత్సవంతో పాటు, వైశాఖ అమావాస్య నాడు ఈ రాశుల వారు శని దేవుడి కటాక్షం కోసం శనికి నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రాలు సమర్పించాలి. అన్నదానం చెయ్యాలి. ఆవనూనెతో శనిదేవుడి ముందు దీపం వెలిగించాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications