30 సంవత్సరాల తర్వాత శష-మాళవ్య రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారం
30 సంవత్సరాలు తర్వాత గ్రహాల రాశుల మార్పు కారణంగా రెండు ముఖ్యమైన యోగాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం కుంభ రాశిలో శని సంచారం కారణంగా శష రాజయోగం ఏర్పడితే, మే 19న శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల అక్కడ మాళవ్య రాజయోగం ఏర్పడింది. ఈ రెండు రాజయోగాల వలన కొన్ని రాశులవారికి కలిసొస్తుంది .వారు మట్టిని పట్టుకున్న బంగారం అవుతుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మిధున రాశి
మిధున రాశి జాతకులకు శష - మాళవ్య రాజ యోగాల కారణంగా అన్ని శుభాలే జరుగుతాయి ఈ సమయంలో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. మీరు వేగంగా అభివృద్ధి చెందుతారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలలో గణనీయమైన లాభాలను సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆస్తులను కొనుగోలు చేయవచ్చు. ఆరోగ్యంగానూ సంతోషంగానూ ఈ సమయంలో గడుపుతారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు శష - మాళవ్య రాజ యోగాల కారణంగా లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగం చేసే చోట గుర్తింపు పొందుతారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఆర్థికంగా మెరుగుదలను చూస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక స్థిరత్వాన్ని ఈ సమయంలో చూస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
సింహరాశి
శష - మాళవ్య రాజ యోగాల కారణంగా సింహరాశి జాతకులకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల సాకారం అవుతుంది. వర్తక వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వివిధ ఆదాయ వనరుల నుండి డబ్బు సంపాదిస్తారు. మీరు పెట్టిన పెట్టుబడుల నుండి విశేషమైన లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామితో సుఖంగా జీవిస్తారు. శుభవార్తలు వింటారు. ఆరోగ్యంగా జీవిస్తారు..
తులారాశి
తులారాశి జాతకులకు శష - మాళవ్య రాజ యోగాల కారణంగా అదృష్టం కలిసొస్తుంది. వర్తక వ్యాపారాలలో లాభదాయకమైన అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి మంచి గుర్తింపు రావడంతో పాటు ప్రమోషన్లు వస్తాయి. మీ ఆర్థిక జీవితం మెరుగుగా ఉంటుంది. భూమి కొనుగోలు చేయవచ్చు. మీడియా రంగంలోనూ, ఫ్యాషన్ డిజైనింగ్ లోను పనిచేసే వారికి గొప్ప అవకాశాలు రావచ్చు. చిన్న అనారోగ్య సమస్యలు మినహాయించి పెద్దగా ఆరోగ్యం విషయంలో ఇబ్బంది లేదు.
కుంభరాశి
కుంభ రాశి జాతకులకు శష - మాళవ్య రాజ యోగాల కారణంగా అన్ని విధాల మేలు జరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు. ప్రమోషన్, ఇంక్రిమెంట్లు మీకు ఆ సంతోషాన్ని కలిగిస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలు పొందుతారు. ఈ సమయంలో మీకు డబ్బుకు లోటు ఉండదు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంగానూ ఈ సమయంలో జీవిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications