శష్ రాజయోగం: ఈ రాశులకు ధనలక్ష్మీ కటాక్షం!!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెలలో శుక్రుడు మాలవ్య రాజయోగం, శని శష్ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు మరియు శని యొక్క సంయోగం కారణంగా శష్ రాజయోగం ఏర్పడుతుంది. ఈ ఖగోళ అమరిక కారణంగా ఏర్పడే ఈ శష్ రాజయోగం కుంభరాశిలో ఏర్పడుతుంది.

కుంభరాశిలో శని సంచరిస్తున్న సమయంలో ఏర్పడే ఈ రాజయోగం వల్ల ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. శుభవార్త లను అందుకుంటారు. సంతోషంలో మునిగి తేలుతారు. ముఖ్యంగా మేష రాశి, మిధున రాశి, సింహ రాశి, కన్యా రాశి జాతకులకు శష్ రాజయోగం అదృష్టాన్ని ఇస్తుంది.

 Shash Rajayoga 2024: Dhanalakshmi blessings for four zodiac signs!!

మేషరాశి
శష్ రాజయోగం కారణంగా మేషరాశి వారు ఆర్థికంగా బలోపేతం అవుతారు. వారు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆధ్యాత్మికంగాను వారు సుసంపన్నంగా ఉంటారు. మార్చి నెల నుండి వారికి అదృష్టం ప్రతి పనిలోనూ సహకారాన్ని అందిస్తుంది. ఈ సమయంలో వారు అనుకూలమైన వార్తలను మాత్రమే వింటారు.

మిధున రాశి
శష్ రాజయోగం కారణంగా మిధున రాశి జాతకులు శుభవార్త లను వింటారు. మిధున రాశి జాతకులు కుటుంబ సౌభాగ్యంతో సంతోషంగా ఉంటారు. విజయం వారికి అన్ని విధాలుగా పురోభివృద్ధిని కలిగిస్తుంది. వారికి ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా అదృష్ట లక్ష్మి వరిస్తుంది.

సింహరాశి
సింహరాశి జాతకులకు శష్ రాజయోగం కారణంగా శ్రేయస్సు లభిస్తుంది. వీరు జీవిత భాగస్వామితో సాన్నిహిత్యాన్ని పెంపొందించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కుటుంబం నుంచి వీరికి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో వ్యాపారాలలో పెట్టుబడులు పెడితే ఆర్థికంగా బాగా లాభపడతారు. అపూర్వమైన వృద్ధికి ఈ సమయంలో సింహ రాశి వారికి అవకాశం ఉంటుంది.

కన్యారాశి
శష్ రాజయోగం కారణంగా కన్య రాశి జాతకులకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వారి జీవితంలో సంతోషం వెల్లి విరుస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఇది సరైన సమయం. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయి, వారు చేసిన శ్రమకు తగిన ఫలితం తప్పకుండా దక్కుతుంది. ఇష్టమైన వారితో విలువైన క్షణాలను ఆస్వాదించడానికి అవకాశం కలుగుతుంది. జీవితంలో ముఖ్యుల నుండి ఊహించని మద్దతు దొరుకుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+