ఈ రాశులవారి పంట పండించనున్న శ్రావణ లక్ష్మి.. మీరున్నారా?

వేద జ్యోతిషశాస్త్రంలో శ్రావణమాసానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రావణ మాసం విష్ణు మూర్తికి ఇష్టమైన మాసంగా చెప్తారు. ఈ మాసంలో విష్ణువును లక్ష్మీ దేవిని పూజించటం కారణంగా సిరి సంపదలు, సౌభాగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా శ్రావణమాసంలో జరిగే గ్రహాలు సంచారాలు కొన్ని రాశుల వారికి శుభాలను చేకూరుస్తున్నాయి. శ్రావణమాసంలో బృహస్పతి, కుజుడు, బుధుడు, శుక్రుడు, శని ప్రధానంగా చేస్తున్న సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయి.

శ్రావణంలో శుభ యోగాలు
.శ్రావణమాసంలో గ్రహాల సంచారం కారణంగా కొన్ని యోగాలు ఏర్పడుతున్నాయి. వాటిలో మాలవ్య రాజయోగం, గజలక్ష్మి రాజయోగం ముఖ్యమైనవి. ఈ రాజయోగాలు ముఖ్యంగా శుభ యోగాలు. ఈ రాజయోగాల కారణంగా కూడా శ్రావణం కొన్ని రాశులను అదృష్ట జాతకులుగా మారుస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం .

Shravan Lakshmi will give wealth to these zodiac signs is your zodiac sign there

మిధునరాశి
మిధున రాశి వారికి శ్రావణమాసం కలిసొస్తుంది. వీరికి సమయంలో ఆర్థికంగా ఎదురైన సమస్యలు తొలగిపోయి ధనయోగం కలుగుతుంది. ఊహించని మార్గాల ద్వారా డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. పై అధికారుల నుంచి మన్ననలు పొందుతారు. సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది. విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం. సరైన సమయంలో సరైన నిర్ణయాలను తీసుకుంటారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు శ్రావణమాసం శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. కర్కాటక రాశి వారు ఈ సమయంలో సంపద విషయంలో తిరుగులేకుండా ఉంటారు. చేసే ప్రతి పనిలో విజయాలను సాధిస్తారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి శ్రావణమాసం కలిసొస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు ఏ పని చేసిన మంచి ఫలితాలను పొందుతారు. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ప్రేమలో ఉన్నవారికి అనుకూలమైన మార్పులు జరుగుతాయి. ఇది ధనుస్సు రాశి వారికి శుభ సమయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+