శుక్ర గోచారం 2024: జులై నెలలో వీరు మట్టి పట్టుకున్నా బంగారమే అవుతుంది!!
జులై మాసంలో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. విలాసాలకు, లగ్జరీలకు అధిపతి అయిన శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. శుక్రుడు జులై ఏడవ తేదీన కర్కాటక రాశిలోకి సంచరిస్తాడు. కర్కాటక రాశిలోకి శుక్ర సంచారం వలన ముఖ్యంగా ఐదు రాశుల వారికి లబ్ధి జరుగుతుంది.
మేష రాశి
శుక్ర సంచారం కారణంగా మేష రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులు లాభాలు పొందుతారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది.

వృషభ రాశి
శుక్ర సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. వృషభ రాశి జాతకులు వ్యాపారంలో లాభపడే అవకాశం ఉంది. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు.
మిధున రాశి
శుక్ర సంచారం కారణంగా మిధున రాశి జాతకులు గణనీయమైన ఆదాయాన్ని పొందుతారు. వర్తక, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ సమయంలో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలలో రాణిస్తారు. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు.
సింహరాశి
శుక్ర సంచారం కారణంగా సింహరాశి జాతకులకు కలిసొస్తుంది. సింహ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు వచ్చే వీలుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
కర్కాటక రాశి
శుక్ర సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. కర్కాటక రాశి వారు ఈ సమయంలో లగ్జరీ లైఫ్ లో లీడ్ చేస్తారు. ఆర్థికంగా ఈ సమయంలో మెరుగుదలను చూస్తారు. వర్తక వ్యాపారాలలోనూ కలిసి వస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. తల్లి ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications