Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రథసప్తమి పండగ రోజు పూజలు.. రోగ, శోక, దారిద్య్ర నివారణ ఎలా అంటే?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

సప్తాశ్వరధ మారుడం - ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేత పద్మ ధరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహం

మాఘ శుద్ధ సప్తమి 1 ఫిబ్రవరి 2020 శనివారం రోజు సూర్యుని జన్మతిధి కావున రధసప్తమి పండగ జరుపుకుంటారు. ఇతర మాసములలోని సప్తమి తిథులకన్న మాఘమాసమందలి సప్తమి చాలా విశిష్టమైనది. ఈ రోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారును భారతీయులే.

Significance of Ratha Saptami: Rituals, Traditions, Puja systems

సూర్య జయంతి, Sun birth day :- ఆదిత్యార్చన అద్భుత శక్తి , పవిత్ర మాఘమాసం మహిమాన్వితం. ఈ మాసంలో అన్ని శుభ దినాలే. మాఘమాసంలో చేసే స్నానం, దేవతార్చన వలన అనంత పుణ్యఫలాలు ఇస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. ప్రతీ సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమిగా, సూర్యజయంతిగా అత్యంత వైభవంగా వేడుకను భారతీయ హిందువులు జరుపుకుంటారు.

ఆరోగ్య ప్రదాత :- మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యనారాయణస్వామిని దర్శించి, సేవించడం ద్వారా రోగ, శోక, దారిద్య్రాలు నివారించు కోవచ్చని పురాణాలు, శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందుకే రథసప్తమి రోజున భక్తులు ప్రత్యేక్ష దైవమైన సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం చేసి అర్ఘ్య వదులుతారు. మాఘశుద్ధ సప్తమి వేకువజామున ఆకాశంలో నక్షత్రాలు రథం ఆకారంలో ఏర్పడుతుంటాయి, ఉత్తరాయణంలో వచ్చే చర్మ, కుష్ఠి, బొల్లి వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే సూర్యారాధన చేయాలి.

కాల నిర్ణయం :- ఏడు గుర్రాలతో బంగారు రథం మీద సూర్యభగవానుని ప్రయాణం సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈ రోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారును భారతీయులే.

విధి విధానాలు :-

సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ,
అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్‌.
మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా,
కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+