29న అరుదైన యోగాలు.. ఈ రాశులవారు జమిందారులే
ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇందుకు ఒక్కో గ్రహం ఒక్కో సమయం తీసుకుంటుంది. ఇలా సంచరించే క్రమంలో కొన్ని శుభ యోగాలు, మరికొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈనెల 29వ తేదీన ధన త్రయోదశిరోజు అరుదైన శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఉత్తర ఫాల్గుణి నక్షత్రాల మహా సంయోగం, వైధ్రుతి యోగం, ఇంద్ర యోగం, త్రిపుష్కర యోగం, త్రిగ్రాహి యోగం ఏర్పడునుండటంతో కొన్ని రాశులకు విపరీతంగా కలిసిరానుంది. దంతేరస్ రోజు ఏ రాశులవారికి కలిసిరానుందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశివారు రెట్టింపు లాభాలను పొందడంతోపాటు ఊహించని రీతిలో ప్రయోజనాలను అందుకుంటారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతోపాటు ప్రమోషన్ వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి.

మిథున రాశి
ఈ రాశివారికి అద్భుతమైన లాభాలున్నాయి. కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి వెళతారు. బుధుడివల్ల వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి నుంచి ప్రత్యేకమైన ఆశీస్సులు లభిస్తాయి.
కర్కాటక రాశి
ప్రతి పనిలో విజయం దక్కుతుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. శుభఫలితాలను పొందడంతోపాటు వ్యాపారస్తులు మంచి లాభాలను ఆర్జిస్తారు. ఆర్థిక పరిస్థితి గతంకంటే మెరుగవుతుంది.
సింహ రాశి
గతంలో కంటే ఆర్థికంగా ఇప్పుడు బలపడతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది. కొత్త వాహనం లేదంటే కొత్త ఆస్తిని కొనుగోలు చేస్తారు.
తులా రాశి
పెట్టిన పెట్టుబడి నుంచి మంచి లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది. ఉద్యోగస్తులకు వారు పనిచేసేచోట గౌరవం లభిస్తుంది. ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. వ్యాపారంలో ఒప్పందాలు కుదురుతాయి.
ధనస్సు రాశి
ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయానికి మార్గాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారి కోరిక నెరవేరుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు పలకరిస్తాయి. భౌతిక సుఖాలను పొందుతారు. ఈ సమయంలోనే అనుకున్న పనులు పూర్తిచేస్తారు.












Click it and Unblock the Notifications