శుభాధియోగంతో ఈ రాశులకు అఖండ ధనయోగం
ఉన్న 12 రాశుల్లో ఏ రాశిలోనైనా 6, 7, 8 స్థానాల్లో బృహస్పతి, శుక్రుడు, బుధుడు సంచారం చేస్తే శుభాధియోగం ఏర్పడుతుంది. దీనివల్ల అధికారికంగా యోగం కలుగుతుంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టి ఆరోగ్యంతో ఉంటారు. ఏయే రాశులవారికి ఈ శుభాధియోగం వల్ల ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
వృశ్చికం
ఆదాయం పెరుగుతుంది. బాగా సంపన్నుల స్థాయికి జీవితం చేరుకుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంతోపాటు వృత్తిలో ఉన్నవారికి కలిసివస్తుంది. ఉద్యోగంలో మంచిస్థాయికి వెళతారు. ఏ రంగంలో ఉన్నా పురోగతి ఉంటుంది.

మేషం
ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. పూర్వీకుల నుంచి కానీ, ఇతరత్రా కానీ ఆస్తి కలిసివచ్చే అవకాశం ఉంది.
కుంభం
వృత్తి, వ్యాపారంలో వస్తున్న నష్టాల నుంచి బయటపడతారు. ఆదాయం అనేక మార్గాల్లో పెరుగుతుంది. రుణబాధలతోపాటు అనారోగ్యం నుంచి, శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది. ఉద్యోగంలో సహోద్యోగులకన్నా ఎక్కువ స్థాయికి చేరుకుంటారు.
మీనం
ఉద్యోగంలో వేతనం భారీగా పెరుగుతుంది. బాగా ఉన్నవారి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది లేదంటే ప్రేమలో పడతారు. లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం తలుపు తడుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది.
వృషభం
ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. అనారోగ్యం తగ్గిపోతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారంతోపాటు వృత్తిలో ఉన్నవారికి రాబడి బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం దూర ప్రాంతాల నుంచి వస్తుంది.
తుల
వివాహ ప్రయత్నంతోపాటు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కలలో కూడా ఊహించనిరీతిలో అవకాశాలు వస్తాయి. అనారోగ్యం తగ్గుముఖం పడుతుంది. ఆదాయం పెరగడంవల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు.












Click it and Unblock the Notifications