solar eclipse 2023: గ్రహణం నాడు తెరిచి ఉండే శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రత్యేకతలివే!!
ఏప్రిల్ 20వ తేదీన అరుదైన హైబ్రిడ్ సూర్యగ్రహణం ఏర్పడనుంది. సాధారణంగా సూర్యగ్రహణం అయినా చంద్రగ్రహణం అయినా అశుభ సూచకంగా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సూర్యుడిని రాహుకేతువులు మింగేసిన సమయంలో సూర్య గ్రహణం ఏర్పడుతుంది. సూర్య గ్రహణం నాడు ఆలయాలలోని దేవతామూర్తులు కూడా శక్తి హీనులు అవుతారు. ఆ కారణంగానే సూర్యగ్రహణం నాడు ఆలయాలను మూసివేసి, ప్రతికూల శక్తుల ప్రభావం లేకుండా చూస్తారు.
అయితే దేశంలో కొన్ని ఆలయాలు మాత్రం సూర్య గ్రహణం, చంద్ర గ్రహణాల సందర్భంగా తెరవబడి గ్రహణ కాల అభిషేకాలను, పూజాధికాలను కొనసాగిస్తాయి. అటువంటి ఆలయాలలో ముఖ్యంగా చెప్పుకోవలసిన ఆలయం శ్రీకాళహస్తీశ్వర ఆలయం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తిరుపతి జిల్లాకు 45 కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తిలో ఉన్న శ్రీ కాళహస్తీశ్వర ఆలయం చాలా విశిష్టమైనది. ఎటువంటి గ్రహణాలు వచ్చినా కాళహస్తీశ్వర ఆలయ తలుపులు తెరిచే వుంటాయి.

గ్రహణ సమయంలోనే ఆలయాన్ని తెరిచి గ్రహణ కాల అభిషేకాలను నిర్వహించడం కాళహస్తీశ్వర ఆలయ ప్రత్యేకత. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి శక్తి గ్రహణకాలంలో ఎక్కువగా ఉంటుందని, రాహు కేతువుల ప్రభావం ఈ ఆలయంపై ఉండదని చెబుతారు. అందుకే గ్రహణ సమయంలో ఈ ఆలయాన్ని తెరిచి పూజలు నిర్వహిస్తారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వెలసినటువంటి వాయు లింగేశ్వర స్వామిని సూర్య చంద్రాగ్ని లోచనుడు అంటారు.
సూర్యుడిని, చంద్రుడిని రెండు కళ్ళుగా కలిగినవాడు వాయు లింగేశ్వర స్వామి అని, ఆయన వద్ద రాహుకేతువుల ఆటలు సాగవని, ఈ ఆలయంపై ఎటువంటి గ్రహణ ప్రభావం ఉండదని చెబుతారు. అందుకే గ్రహణ సమయంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తజనం పోటెత్తారు. గ్రహణం నాడు గ్రహణ కాల అభిషేకాలను నిర్వహించడంతో పాటు రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజలను కూడా నిర్వహిస్తారు.

సూర్య గ్రహణం నాడు గ్రహణానికి ముందు పూజలను చేస్తారు. అంతేకాదు మన రాష్ట్రంలో రాహుకేతువులను పూజించే దేవాలయంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉండటం మరో విశేషంగా చెప్పవచ్చు. రేపు సూర్య గ్రహణం కావటంతో రేపు ఆలయం తెరిచే ఉంటుంది. రేపు భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న కారణంగా ఆలయంలో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications