సూర్యగ్రహణం 2024: 3 రాశులవారి జీవితాలలో ఊహించని మార్పులు!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మాత్రమే కాదు గ్రహణాలు కూడా జీవితంపైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. 2024 సంవత్సరంలో రాబోతున్న మొట్టమొదటి సూర్యగ్రహణం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రాత్రి 9 గంటల 12నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ సూర్యగ్రహణం అర్ధరాత్రి ఒంటిగంట 25 నిమిషాలకు ముగుస్తుంది. అంటే ఏప్రిల్ 9వ తేదీన ముగుస్తుంది.
ద్వాదశ రాశులవారి జీవితాలపై సూర్యగ్రహణ ప్రభావం
ఈ సమయంలో సుమారు ఏడున్నర నిముషాల పాటు సూర్యుడు కనిపించడు. ఈ గ్రహణం చాలా అరుదుగా ఉంటుంది. అయితే మన దగ్గర సూర్యగ్రహణం రాత్రి సమయంలో సంభవిస్తుంది. కాబట్టి ఎటువంటి ప్రభావము ఉండదు. కానీ సూర్యగ్రహణం వారి జీవితాలపైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారు ఊహించని మార్పులను వారి జీవితంలో చూస్తారు. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

కర్కాటక రాశి
సూర్య గ్రహణం కర్కాటక రాశి వారి జీవితాలలో పెను మార్పులను తీసుకువస్తుంది. కర్కాటక రాశి జాతకులు మీ పని శైలిని మార్చవలసి ఉంటుంది. కర్కాటక రాశి వారి జీవితంలో వస్తున్న పరివర్తన మీ ఇంట్లోను, మీ పని చేసే కార్యాలయంలోనూ చాలా మార్పులకు కారణమవుతుంది. కుటుంబంలో చాలా విషయాలు ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకుని విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
తులారాశి
సూర్యగ్రహణం తులారాశి వారి జీవితాలలో గణనీయమైన మార్పులకు కారణం అవుతుంది. ఈ సమయంలో మీరు ప్రజలను బాగా అర్ధం చేసుకోలేకపోవచ్చు. మీ ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురు కావచ్చు. మీరు చేసిందే కరెక్ట్ అనుకోవచ్చు.. కానీ మీరే తప్పు కావచ్చు. కనుక ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి
మకరరాశి జాతకుల జీవితంలో చాలా మార్పులు సంభవిస్తాయి. కొన్ని విషయాలు మీ నియంత్రణలో ఉండకపోవచ్చు. అంచనాలకు మించి కూడా ఉండవచ్చు. ఈ సమయంలో మీకోసం కొన్ని ఆశ్చర్యకర ఫలితాలు ఉన్నాయి. చాలా కాలం పాటు కష్టపడి పనిచేసిన ప్రతిఫలం ఈ సమయంలో లభిస్తుంది. మీరు ప్రశంసలను అందుకుంటారు. సూర్య గ్రహణం సమయంలో మకరరాశి జాతకులు కచ్చితంగా ప్రయోజనాలను పొందుతారు. సూర్యగ్రహణం మీ కుటుంబంలో కూడా మార్పులను తీసుకువస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications