Solar eclipse 2025: వీరికి సంపదల ప్రకాశం ఇస్తానన్న మొదటి సూర్యగ్రహణం!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025లో మొదటి సూర్యగ్రహణం రోజు మరొక ఖగోళ దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. 2025 మార్చి 29వ తేదీన మొదటి సూర్యగ్రహణం సంభవిస్తుంది . మధ్యాహ్నం 2 గంటలు 21 నిమిషాల నుండి సాయంత్రం 6గంటల 14 నిమిషాల వరకు సూర్యగ్రహణం ఉంటుంది.

2025 లో మొదటి సూర్యగ్రహణం.. అదృష్ట రాశులు
అదే రోజు రాత్రి 11 గంటలకు శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ సూర్యగ్రహణ ప్రభావం కొన్ని రాశులకు శుభాలను చేకూరిస్తే, మరి కొన్ని రాశుల పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. 2025 లో వచ్చే మొదటి సూర్యగ్రహణంతో లబ్ధి పొందే ఆ రాశులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Solar eclipse 2025 First solar eclipse in march these zodiac signs are the lucky and wealthy stars

ధనుస్సు రాశి
2025 సంవత్సరంలో సూర్యగ్రహణం తోపాటు అదే రోజు శని సంచారం చేయడం వల్ల ధనుస్సురాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ధనుస్సు రాశి వారికి ఈ మార్పు ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతుంది. ఊహించని విధంగా వీరి ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. ఈ సమయంలో ఏ పని చేసిన విజయాలు సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

తులారాశి
సూర్యగ్రహణంతోపాటు శని సంచారం తులారాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు. పాత పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు కూడా వస్తాయి. ఈ సమయంలో తులా రాశి జాతకులు ఏ పని చేసిన విజయం సాధిస్తారు.

మీన రాశి
సూర్యగ్రహణంతోపాటు శని సంచారం కారణంగా మీన రాశి వారికి ఆర్థిక లాభాలు వస్తాయి. ఈ సమయంలో మీన రాశి వారి ఆదాయం పెరుగుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న ఈ సమయంలో ప్రారంభిస్తే కలిసి వస్తుంది.

మిధున రాశి
2025 సంవత్సరం మిధున రాశి వారికి శుభాలను ఇస్తుంది. ఈ సంవత్సరం మీరు చేసే అన్ని ప్రయత్నాలలోనూ విజయం సాధిస్తారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మిధున రాశి జాతకులకు ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇల్లు కొనాలనుకునే వారికి కోరిక ఈ సమయంలో తీరుతుంది. ఇది మిధున రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చే సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+