త్వరలో ధనశక్తి రాజయోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కనున్నారు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు తన సొంత రాశి అయిన వృశ్చిక రాశిలో కుజుడు తో కలిసి ధన శక్తి రాజయోగాన్ని సృష్టిస్తున్నాడు. ధన శక్తి రాజయోగం కొన్ని రాశుల వారికి అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. డిసెంబర్ 7వ తేదీ వరకు ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారు లబ్ధిని పొందబోతుతున్నారు.
ధనశక్తి రాజయోగం
నవంబర్ 26వ తేదీన శుక్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. కుజుడు అప్పటికే వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు వృశ్చిక రాశిలో కి నవంబర్ 26వ తేదీన శుక్రుడి రాక, కుజుడి సంయోగంతో కలిసి ధన శక్తి రాజయోగానికి కారణమవుతుంది. ఈ రాజయోగం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభరాశి జాతకులకు ధనశక్తి రాజయోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశిలో ఏడవ ఇంట్లో శుక్రుడు కుజుడు కలయిక జరుగుతుంది. దీంతో వీరికి వృత్తిలో అపారమైన విజయాలు వస్తాయి. వివిధ ఒప్పందాల నుండి లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. వివిధ వనరుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వైవాహిక జీవితం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
కన్యారాశి
కన్యారాశి జాతకులు ధన శక్తి రాజ యోగంతో లబ్ధిని పొందుతారు. కన్యరాశిలో నాలుగవ ఇంట్లో శుక్రుడు మరియు కుజుడు సంయోగం జరుగుతుంది. వీరికి ఈ సమయం గొప్ప ఆర్ధిక ప్రయోజనాలను తెస్తుంది. కన్యారాశి వారి సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కన్యారాశి జాతకులు పేరు ప్రతిష్టలు పొందుతారు. ఆదాయం సంపాదించడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. విదేశాలలో ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
సింహరాశి
ధన శక్తి రాజయోగం కారణంగా సింహరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. సింహరాశి జాతకులు తమ కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ప్రేమ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి జీవితంలో నమ్మకం పెరుగుతుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఏ పని చేసిన సింహ రాశి వారికి కలిసి వస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications