త్వరలో ప్రబోధిని ఏకాదశి.. ఈ ఒక్క వస్తువు తెచ్చుకుంటే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్టే!
హిందూమతంలో ప్రబోధిని ఏకాదశికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రబోధిని ఏకాదశిని దేవుత్తని ఏకాదశిగా, ఉత్థాన ఏకాదశిగా కూడా చెబుతారు. ఈరోజు శ్రీమహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొని భక్తులను ఆశీర్వదిస్తాడు. ఇక శ్రీమహావిష్ణువు నాలుగు నెలల తర్వాత నిద్ర నుంచి మేల్కొన్న ఈ కాలం నుండి వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు మొదలవుతాయి.
ప్రబోధిని ఏకాదశికి ఈ వస్తువును ఇంటికి తెచ్చుకోండి
ఈ ప్రబోధిని ఏకాదశి నవంబర్ 12వ తేదీన వస్తుంది. ఈరోజుతో చాతుర్మాసం ముగుస్తుంది. అయితే ప్రబోధిని ఏకాదశి రోజు మనం ఇంటికి ఒక వస్తువుని తెచ్చుకుంటే అది మనకు శుభాలని ఇస్తుంది. అది లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది. మరి ఆ వస్తువు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ప్రబోధిని ఏకాదశి రోజు ఇంటికి శ్రీ యంత్రాన్ని తెచ్చుకొని నిష్టగా పూజలు చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వారిపై ఉంటుందని చెబుతారు.

శ్రీ యంత్రం చాలా శక్తివంతం
శ్రీ యంత్రాన్ని హిందువులు చాలా పవిత్రంగాను, అత్యంత శక్తివంతమైనదిగాను భావిస్తారు. శ్రీ యంత్రం యొక్క ఆరాధన అద్వైతాన్ని, సంపూర్ణతను వ్యక్తపరుస్తాయి. శ్రీ యంత్రాన్ని శంకరాచార్యులు పరిపూర్ణం చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆరాధన పరికరం. జ్యోతిషశాస్త్రంలో ఇది సంపదకు చిహ్నంగా చెప్పబడుతుంది.
ఈ శ్రీయంతం ఇంట్లో ప్రతిష్ఠిస్తే మంచిది
శ్రీ యంత్రానికి అనేక రూపాలు ఉన్నాయి. కొన్ని శ్రీ యంత్రాలు ప్లాట్ గానూ, మరికొన్ని పిరమిడ్ రూపంలోనూ పెరిగినట్టుగాను ఉంటాయి. అయితే ఒక్కో రకమైన శ్రీ యంత్రం ఒక్కోరకమైన ప్రయోజనాలను కలుగజేస్తుంది. ఇక ప్రబోధిని ఏకాదశి రోజు పూజ మందిరంలో క్రిస్టల్ పిరమిడ్ తో తయారు చేసిన శ్రీయంత్రాన్ని ప్రతిష్టించడం శుభప్రదంగా భావించబడుతుంది.
శ్రీ యంత్రాన్ని పూజిస్తే సిరిసంపదలు
ఇక శ్రీ యంత్రానికి ప్రతిరోజు ఉదయం నీళ్లతో అభిషేకం చేసి, పుష్పాలను సమర్పించి ఆ తర్వాత నెయ్యి దీపం వెలిగించి శ్రీ యంత్ర మంత్రాన్ని జపిస్తే ఫలితం ఉంటుందని చెబుతారు. ఎవరైతే ప్రబోధిని ఏకాదశి రోజు శ్రీ యంత్రాన్ని ప్రతిష్టించి పూజిస్తూ శ్రీయంత్ర మంత్రాన్ని జపిస్తారో వారికి సిరిసంపదలు వస్తాయని, విష్ణుమూర్తి కటాక్షం తప్పనిసరిగా ఉంటుందని, ఆర్థిక సంక్షోభం నుంచి వారు బయటపడతారని చెబుతారు. ఇంత ప్రత్యేకతలు ఉన్న శ్రీ యంత్రాన్ని ప్రబోధిని ఏకాదశి రోజు తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications