sri rama navami 2024.. శ్రీరామ నవమినాడు ఈ పనులు అస్సలే చెయ్యొద్దు!
జగదభిరాముడు శ్రీరాముడు.. లోక రక్షకుడు అయిన శ్రీ రాముల వారి శ్రీరామ నవమి వేడుకలు జరుపుకోవటానికి దేశం సిద్ధం అవుతుంది. అయోధ్య రామాలయంతో పాటు దేశ వ్యాప్తంగా రామలయాలలో రామయ్య నవమి వేడుకలు అట్టహాసంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీతారాముల కళ్యాణం లోక కళ్యాణార్ధం అని చెప్తారు. అలాంటి రామయ్యకు వాడ వాడలా కళ్యాణం జరిపి వేడుకలు చేసుకుంటారు.
రామయ్య నవమి నాడు కొన్ని పనులకు దూరంగా ఉండాలి
ఈ సంవత్సరం శ్రీరామ నవమి రేపు అంటే ఏప్రిల్ 17 వ తేదీన అత్యంత వైభవోపేతంగా జరగనుంది. ఇంతటి మహిమాన్వితమైన శ్రీరామ నవమి నాడు ఏం చెయ్యొచ్చు? ఏం చెయ్యకూడదు? వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. సాక్షాత్తు మహా విష్ణు స్వరూపం అయిన శ్రీ రాముడిని పూజించే రామ నవమి వేళ కొన్ని పనులకు దూరంగా ఉండాలి. ఈ రోజు అత్యంత నియమ నిష్టలతో శ్రీరాముడిని పూజించాలి .

శ్రీ రామ నవమి నాడు ఈ పనులు అస్సలే చెయ్యకూడదు
శ్రీరామ నవమి నాడు తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. మాంసాహారానికి, మసాలాలతో కూడిన ఆహారాన్ని పొరబాటున కూడా తినకూడదు. రామ నవమి నాడు మాంసాహారం తింటే రామయ్యకు అపచారం కలుగుతుంది. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రీరామ నవమి నాడు వెల్లిపాయలను, ఉల్లిపాయలను తినడం మానేయాలని చెబుతున్నారు.
ఈ పనులు చేస్తే రామయ్యకు ఆగ్రహం
శ్రీ రామ నవమి వేడుకలను చేసే వారు, రాముల వారి కళ్యాణం చేయించే వారి వెల్లిపాయలను, ఉల్లిపాయలను ఆహారంలో తినడం మానుకోవాలి. ఆహారం మాత్రమే కాదు మద్యం సేవించటం, ధూమపానం చెయ్యటం రామ నవమి నాడు చెయ్యకూడదు. శ్రీరామ నవమి నాడు పొరబాటున కూడా గోర్లు, జుట్టు కత్తిరించకూడదు. ఒకవేళ కత్తిరించుకుంటే రామయ్య ఆగ్రహంతో మీ ఆరోగ్యం మరింత దిగజారుతుందని చెబుతారు.
రామ నవమి నాడు భార్యా భర్తలు ఇలా ఉంటే కష్టాలు
రామ నవమి నాడు ఎవరు వివాదాల జోలికి, వాదనల జోలికి పోకూడదు. ఎవరితోనూ గొడవలకు దిగకూడదు. హింస చెయ్యరాదు. ముఖ్యంగా భార్యా భర్తలు అస్సలు తగవులు ఆడకూడదు. ఇతరుల వ్యవహారాలలో, వివాదాలలో తల దూరిస్తే రామయ్యకు ఆగ్రహం వస్తుంది.ఫలితంగా ఆర్ధిక కష్టాలు, నష్టాలు కలుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications