Sri Rama Navami: రాముడికి నైవేద్యంగా పానకం, వడపప్పు స్పెషల్.. ఎందుకంటే!!

శ్రీరామనవమి పర్వదినాన్ని అట్టహాసంగా జరుపుకోవడానికి యావత్ భారతదేశం రెడీ అయింది. జగదభి రాముడు, రవికుల తిలకుడు ఆయన శ్రీరామచంద్రమూర్తి పుట్టిన రోజే శ్రీరామనవమి. శ్రీరాముని పూజించే భక్తులకు శ్రీరామనవమి ఒక పండుగలాంటి పర్వదినం. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాముల కళ్యాణం లోకకళ్యాణం కోసం నిర్వహిస్తారని పండితులు చెబుతారు. అందుకే వాడవాడలా శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి, కళ్యాణాన్ని కనులారా వీక్షించి ఆ శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించి తరిస్తారు.

రామయ్యకు పెట్టే నైవేద్యాలలో పానకం, వడపప్పు స్పెషల్
అయితే శ్రీరామనవమి పండుగ రోజు శ్రీరామునికి ఇష్టమైన నైవేద్యాలను ఆయన ముందుంచి పూజిస్తారు. శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టే వాటిలో పానకం, వడపప్పు రెండు ప్రత్యేకమైనవి. ఎందుకు శ్రీరామనవమి పండుగ రోజు ఈ రెండింటిని నివేదిస్తారు అంటే దీనికి సంబంధించి శాస్త్రీయ, ఆధ్యాత్మిక దృక్కోణాలు ఉన్నాయని చెబుతారు. శ్రీ రామచంద్రమూర్తికి బెల్లం అన్న పానకం అన్న ఇష్టమని, సీతమ్మని వివాహమాడేందుకు శ్రీరాముడు స్వయంవరానికి వచ్చిన సమయంలో ఆయనకు బెల్లంపానకం ఇచ్చారని చెబుతారు.

Sri Rama Navami Panakam and vadappu special to lord sri ram this is the reason

రామయ్యకు సీతా స్వయంవర వేళ బెల్లం పానకం ఇచ్చినట్టు చరిత్ర
అప్పట్లో రాముల వారి కాలంలో వేసవిలో బాటసారులకు వడదెబ్బ తగలకుండా బెల్లం పానకం ఇచ్చేవారట. ఈ క్రమంలోనే స్వయం వరానికి వెళ్ళిన శ్రీరామచంద్రుడికి కూడా బెల్లం పానకాన్ని ఇచ్చినట్లు చెబుతారు. దీంతో శ్రీరాముని ఆయనకు నైవేద్యంగా నివేదిస్తారు. ఆపై ప్రసాదంగా అందరూ స్వీకరిస్తారు. వడపప్పు కూడా స్వామివారికి ఇష్టమైన ప్రసాదంగా నివేదిస్తారు

బెల్లం పానకంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
శాస్త్రీయ కోణంలో చూస్తే ఎండలు మండే కాలంలో శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ఆ వేసవి ఉష్ణోగ్రతల నుంచి బయటపడడానికి బెల్లం పానకం బాగా పనికొస్తుందని, స్వామివారి కల్యాణానికి వచ్చిన వారందరికీ బెల్లం పానకాన్ని ఇస్తారని చెబుతారు. ఇక ఈ పానకంలో మిరియాల పొడిని కూడా కలపడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెప్తారు.

వడపప్పుతోనూ బెనిఫిట్స్
ఇక వడపప్పు ను తినడం వల్ల కూడా మలబద్ధకం తొలగిపోతుందని ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా శ్రీరామనవమి సందర్భంగా ఔషధ యుక్తమైన ప్రసాదాలను, స్వామికి నివేదించడమే కాకుండా వాటిని భక్తులంతా స్వీకరిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+