శుక్రుడి గోచారం: జులై 7 వరకు వీరికి వరాల జల్లు
గ్రహాల గోచారం లేదంటే రాశుల పరివర్తనం అనేది వేర్వేరు రాశులపై వేర్వేరుగా ఉంటుంది. శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుండటంతో 3 రాశులపై ప్రభావం ఉండబోతోంది. వీరికి అనేక ప్రయోజనాలు కలగనుండటమే కాకుండా చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. జ్యోతిష్యం ప్రకారం గత నెల 30వ తేదీన శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించాడు. హిందూ విశ్వాసాల ప్రకారం శుక్రుడిని ధనానికి, వైభవానికి, ప్రేమకు, సౌందర్యానికి ప్రతీకగా భావిస్తారు. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. జులై 7వ తేదీ వరకు కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో ఏయే రాశులవారికి కలిసి రానుంది అనే విషయాన్ని తెలుసుకుందాం.
మీన రాశి
శుక్రుడి గోచారంతో వీరికి మంచి రోజులు ప్రారంభమైనట్లే. సమాజంలో వీరికి అత్యంత గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప్రేమ జీవితంతోపాటు వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. ఆర్థిక విషయాల్లో పొదుపునకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆరోగ్యంపై అప్రమత్తత ఉండాలి. ఊహించని విధంగా డబ్బులు రావడంతో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు వారి వారి రంగాల్లో లాభాలుంటాయి.

మేష రాశి
శుక్రుడి గోచారం వీరికి వరాల జల్లు కురిపిస్తోంది. అంతులేని ధన లాభం ఉండనుంది. పనిచేసేచోట పై అధికారులతోపాటు తోటి ఉద్యోగులు కూడా మీ పనితీరుపై ప్రశంసలు గుప్పిస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఉద్యోగం చేసేవారికి ఇది అనువైన సమయం. గతంలో చేపట్టి మధ్యలో నిలిచిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయి.
మిథున రాశి
వీరికి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది. అదృష్టం ఎప్పుడూ వీరిని వెంటపెట్టుకొనే ఉంటుంది. ఊహించని రీతిలో ధనలాభం కలగడంవల్ల ఆర్ధికంగా బలోపేతమవుతారు. ఆరోగ్యంపై ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడతాయి.












Click it and Unblock the Notifications