సూర్యుడు, కేతువు ఈ రాశులవారికి త్వరలో సంపదల మూటలు తెస్తున్నారు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా అన్ని రాశుల వారి పైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో సూర్యుని కదలిక అనేక రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. సూర్యుడు ఆగస్టు 16వ తేదీ నుంచి తన సొంత రాశి అయిన సింహరాశిలో సంచరిస్తాడు. ఏడాది తర్వాత సూర్యుడు తన సొంత రాసిన సింహరాశిలో ప్రయాణం చేయనున్నాడు.
కన్యారాశిలో సూర్య కేతువుల సంయోగం
ఆపై సూర్యుడు సెప్టెంబర్ 16వ తేదీన కన్యరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఇప్పటికే కేతువు కన్యరాశిలో తిరోగమన దశలో సంచరిస్తుండగా సూర్యుడు కూడా కన్యారాశిలోకి ప్రవేశించడంతో సూర్య కేతువుల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి శుభాలు జరుగుతాయి. ఆయా రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి.

మేష రాశి
సూర్య కేతువుల సంయోగం కారణంగా మేష రాశి వారికి శుభాలు జరుగుతాయి. వీరు కెరీర్లో విజయాన్ని సాధిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు వరిస్తాయి. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ సమయంలో విజయం సాధిస్తారు. ఇది మేషరాశి వారికి శుభాలను ఇచ్చే సమయం.
వృషభ రాశి
సూర్యకేతు కలయిక వృషభ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది .సూర్య కేతువుల సంయోగం కారణంగా వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఈ సమయంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఊహించని ధన లాభాలు కలుగుతాయి. జీవితంలో ఏ పని చేసినా సఫలం అయ్యే సమయం ఇది . వృషభ రాశి వారు ఈ సమయంలో ప్రశాంతంగా జీవిస్తారు.
సింహరాశి
సూర్య కేతువుల సంయోగం కారణంగా సింహరాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభం ఉంటుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా సింహ రాశి వారు ఈ సమయంలో విజయం సాధిస్తారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి.
ధనుస్సు రాశి
సూర్య కేతువుల సంయోగం ధనస్సు రాశి వారికి ధనవర్షం కురిపిస్తుంది .ధనుస్సు రాశి వారి పురోగతికి కొత్తదారులు తెరుచుకుంటాయి. వర్ధక వ్యాపారాలు చేసే వారికి డబ్బు సంపాదించే అవకాశాలు మెండుగా ఉంటాయి. సామాజికంగా గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications