నేటినుండి వీరికి ధననష్టం, కష్టం కలిగిస్తానని హెచ్చరిస్తున్న సూర్యుడు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యభగవానుడికి ఉండే స్థానం చాలా గొప్పది. గ్రహాలకు రాజుగా చెప్పే సూర్య భగవానుడి రాశి సంచారం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. నేడు సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. వృశ్చిక రాశిలో సూర్య ప్రవేశం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుండగా కొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని కలిగిస్తుంది.

వృశ్చిక రాశిలో సూర్య సంచారం.. దురదృష్ట రాశులు
నేడు ఉదయం ఏడు గంటల 41 నిమిషాలకు వృశ్చిక రాశిలో సూర్య సంచారం జరిగింది. ఈ సంచారం వృషభ రాశి, కర్కాటక రాశి, మకర రాశి, కుంభరాశి, వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తే మేష రాశి, మిధున రాశి, కన్యారాశి, తులారాశి, ధనస్సు రాశి వారికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది.

Sun gives unluck and difficulties to these zodiac signs with transit into scorpio today

మేషరాశి
వృశ్చిక రాశిలో సూర్య సంచారం కారణంగా మేష రాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. వీరి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రశాంత జీవనం మాత్రం ఉండదు. ఈనెల వీరిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. సంయమనంతో వ్యవహరించాలి.

మిధున రాశి
వృశ్చిక రాశిలో సూర్య సంచారం కారణంగా మిధున రాశి జాతకులకు కష్టాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో మిధున రాశి వారు ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉండడంతో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఇది మిధున రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం.

కన్యారాశి
వృశ్చిక రాశిలో సూర్య సంచారం కారణంగా కన్యా రాశి వారి జీవితంలో పెను మార్పులు వస్తాయి. ఉద్యోగంలో మార్పు వస్తుంది. కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పిల్లల కారణంగా బాధపడతారు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తులారాశి
వృశ్చిక రాశిలో సూర్య సంచారం కారణంగా తులా రాశి జాతకులకు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మనసు కలత చెందుతుంది. మానసిక స్థితి బాగుండదు. కోపం పెరుగుతుంది. వ్యాపారంలో సమస్యలు వస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది .ఆస్తులు విషయంలో విభేదాలు చోటుచేసుకుంటాయి.

ధనుస్సు రాశి
వృశ్చిక రాశిలో సూర్య సంచారం కారణంగా ధనుస్సు రాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి ధనస్సు రాశి వారి మనసులో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రతికూల ఆలోచనలతో ప్రభావితం అవుతారు. మితిమీరిను కోపం వస్తుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. వ్యాపార విస్తరణ సాధ్యం కాదు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి సూర్యసంచారం అదృష్టాన్ని ఇస్తుంది. సూర్య సంచారం కారణంగా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. విద్యార్థులకు ఈ సమయంలో సానుకూలంగా ఉంటుంది. ఇది నిజంగా అదృష్ట సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+