వీరికి నేటినుండి డబ్బులవర్షం... నా మాటే శాసనం అంటున్న సూర్యుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు వివిధ రాశుల లోకి సంచారం చేయటం ద్వాదశ రాశులవారికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. గ్రహాల రారాజు అయిన సూర్యుడికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సూర్యుడు నవంబర్ 16న అంటే నేడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
నేడే సూర్య సంచారం
ఉదయం 7.41 నిముషాలకు సూర్య సంచారం జరుగుతుంది. వృశ్చిక రాశిలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టం ఇస్తుంది. సూర్యుడికి అనుకూలమైన అంగారకుడు పాలించే రాశిచక్రం అయిన వృశ్చిక రాశిలో సంచారం కారణంగా ప్రయోజనం పొందే ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి
గ్రహాల రారాజుగా భావించే సూర్యుడు వృశ్చిక రాశిలో సంచారం కారణంగా వృషభ రాశి వారి జాతకం మారిపోతుంది. వృషభ రాశి వారికి ఇది అదృష్ట సమయం. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి.
కర్కాటక రాశి
వృశ్చిక రాశిలో సూర్య సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. నేటి నుండి ఈ రాశి వారికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. వర్తక వ్యాపారాలు చేసేవారు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు.
మకర రాశి
వృశ్చిక రాశిలో సూర్య సంచారం కారణంగా మకర రాశి జాతకులకు ఈ సమయం శుభ ప్రదంగా ఉంటుంది. కెరీర్ కి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం.
కుంభరాశి
వృశ్చిక రాశిలో సూర్య సంచారం కుంభరాశి వారికి బాగా కలిసొస్తుంది. కుంభ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. జీవితంలో సానుకూల పరిణామాలు ఎదురవుతాయి. వ్యాపారులు లాభాలను పొందుతారు. చాలా కాలంగా ఉన్న సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా లాభపడతారు. జీవితంలో సానుకూలమైన పరిణామాలతో కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి సూర్యసంచారం అదృష్టాన్ని ఇస్తుంది. సూర్య సంచారం కారణంగా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. విద్యార్థులకు ఈ సమయంలో సానుకూలంగా ఉంటుంది. ఇది నిజంగా అదృష్ట సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications