ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు.. జులై 6వరకు ఈ రాశులవారికి చుక్కలే!

నవగ్రహాలలో దేనికదే ప్రత్యేకమైనది. జ్యోతిష్య శాస్త్రంలో శక్తివంతమైన గ్రహాలలో సూర్యుడు ముఖ్యమైన వాడు. గ్రహాలకు రారాజుగా సూర్యభగవానుడిని చెబుతారు .అటువంటి సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మాత్రమే కాకుండా, ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రం లోకి కూడా సంచారం చేస్తాడు. జూన్ 22వ తేదీ ఉదయం అంటే నేడు సూర్యుడు ఆరుద్ర నక్షత్రం లోకి ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రవేశించాడు.

ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు
సూర్యుడు ఆరుద్ర నక్షత్రం లోనే జులై ఆరవ తేదీ వరకు ఉంటాడు. ఆరుద్ర నక్షత్రంలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుండగా మరికొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని కలుగజేస్తుంది. ఆరుద్ర నక్షత్రానికి రాహువు అధిపతిగా ఉండటం వల్ల ఆరుద్ర నక్షత్రంలో సూర్య సంచారం మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలను, కష్టాలను కలిగిస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Sun in Arudra nakshatra These zodiac signs to face difficulties and financial losses

మిధున రాశి
మిధునరాశి వారికి సూర్య సంచారం వలన అనేక ఇబ్బందులు వస్తాయి. మిధునరాశి వారు ఈ సమయంలో ఏ పని చేసిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమయంలో కొన్ని పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి నష్టాలు వస్తాయి. భాగస్వామ్య ఒప్పందాలు చేయాలని ఆలోచించేవారు ఈ సమయంలో దూరంగా ఉండటమే మంచిది. కుటుంబసభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశముంది. మిధునరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి సూర్య సంచారం నష్టాలకు, కష్టాలకు కారణంగా మారుతుంది. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన కలిసి రాదు. ధనస్సు రాశి వారికి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశ కలుగుతుంది. విద్యార్థులు మానసిక సమస్యలతో ఇబ్బంది పడతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తికాక ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు చేయని తప్పులకు కూడా మాటలు పడవలసి వస్తుంది.

కన్యారాశి
కన్యా రాశి వారికి నేటి నుంచి కష్టాలు మొదలవుతున్నాయి. కన్యారాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా నిరాశకు గురవుతారు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కన్యారాశి వారిని బాధిస్తాయి. ఉద్యోగం చేసే వారు పని భారంతో ఇబ్బంది పడతారు. చేసిన పనికి తగిన గుర్తింపు లేక బాధపడాల్సి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి నష్టాలు వస్తాయి. అనవసరమైన కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.ఇది కన్యా రాశి వారు సమస్యలను ఎదుర్కొనే కాలం కాబట్టి జాగ్రత్త.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+