ధనిష్ట నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశులకు ఊహించని సంపద
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ఈ నెల 6వ తేదీన ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశించాడు. సూర్యుడు ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశించడంవల్ల వరిష్ట యోగం, గజకేసరి యోగాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల 5 రాశులకు చాలా బాగుంటుంది. ఆర్థికంగా అద్భుత ప్రయోజనాలు దక్కనున్నాయి. ఏయే రాశులకు ఈ రెండు యోగాల వల్ల కలిసివస్తుందనే వివరాలను తెలుసుకుందాం.
మేష రాశి
ఉద్యోగులకు వారి పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. సూర్యుడు, కుజుడు కర్మ స్థానంలో ఉంటారు. దీనివల్ల మనోధైర్యంతో ఏ పనినైనా చక్కబెట్టే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటారు. వీరికి అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి
ఈ రాశివారు మానసికంగా చాలా దృఢంగా తయారవుతారు. విద్యార్థులు బాగా రాణిస్తారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవాన్ని పొందుతారు. అలాగే పదోన్నతులు కూడా పొందుతారు. ప్రేమలో ఉన్నవారి జీవితం ఆనందకరంగా సాగుతుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తిచేస్తారు.
కుంభ రాశి
ఊహించినదానికంటే ఎక్కువగా ఈ రాశివారికి అద్భుత ప్రయోజనాలు దక్కుతాయి. ఆస్తి కలిసివస్తుంది. వీరికి వాహన యోగం ఉంది. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు లేదంటే విహారయాత్రలకు వెళతారు. జీవితంలో శ్రేయస్సు, ఆనందం పెరుగుతుంది.
వృషభ రాశి
ప్రత్యర్థులపై విజయాన్ని అందుకుంటారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. కెరీర్ కు సంబంధించి మంచి పురోగతిని సాధిస్తారు. ఆర్థికంగా మీ పరిస్థితి మెరుగుపడుతుంది. చేసే పనులన్నీ సకాలంలో పూర్తిచేయగలుగుతారు. ఉద్యోగులకు వారి పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది.
కర్కాటక రాశి
కొత్తగా ఆదాయ వనరులు తోడవుతాయి. ఆర్థికంగా బలోపేతమవుతారు. బంధువుల నుంచి శుభవార్తలను అందుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications