వృషభరాశిలోకి సూర్యుడి సంచారం.. కలిసివస్తున్న ఆస్తి

ప్రస్తుతం మేష రాశిలో సంచరిస్తున్న రవి గ్రహం 16వ తేదీ(మంగళవారం) నుంచి వృషభ రాశిలో సంచరించనుంది. రవి రాశి మారటం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో కచ్చితంగా మార్పు చోటు చేసుకుంటుంది. గ్రహాలకు రాజు అయినటువంటి రవి గ్రహం వృషభ రాశి నెలరోజులు ఉంటాడు. ఏ రాశివారికి ఏవిధంగా ఫలితం ఉంటుందో తెలుసుకుందాం.

తులా రాశి: అదృష్ట యోగం పట్టడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి వల్ల ఆస్తి కలిసి రావడం లేదంటే సంపద పెరగడం జరుగుతుంది. జీవిత భాగస్వామి ఉద్యోగంలో చేరడం, సంపాదన పెరగడంవంటివి జరుగుతాయి. కుటుంబంలో ఒకరి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. సన్నిహితులైనవారితో అపార్థాలు తలెత్తుతాయి.

Sun Transit 2023 these zodiac persons are very lucky

వృశ్చిక రాశి: ఉద్యోగపరంగా అభివృద్ధి సాధిస్తారు. ధనలాభం ఉంది. జీవిత భాగస్వామి తరఫు బంధువుల నుంచి మేలు కలుగుతుంది. మంచి పరిచయాలతోపాటు అనవసర పరిచయాలు కూడా ఏర్పడతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు.

ధనుస్సు రాశి: ఈ రాశివారికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. ఎప్పటినుంచో వసూలుకాని బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా వాగ్దానం చేయడం లేదంటే హామీ ఉండటంకానీ చేయకపోవడం మంచిది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి.

మకర రాశి: శుభవార్తలను వింటారు. శుభకార్యం జరుగుతుంది. వీరిచ్చే సలహాలు, సూచనలు యజమానులకు మంచి ప్రయోజనాన్ని కల్పిస్తాయి. సమాజంలో గౌరవం, మర్యాద పెరుగుతుంది. పాజిటివ్ దృక్పథంతో వ్యవహరించాలి.

కుంభ రాశి: జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి. విలాసాలమీద డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కూడా ఖర్చు పెరుగుతుంది. బంధువులకు లేదంటే స్నేహితులకు ఆర్థిక సాయం చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్త వస్తుంది.

మీన రాశి: వీరు ఏ పనిచేసినా విజయవంతమవుతారు. చిన్న చిన్న ప్రయత్నాలతోనే ప్రయోజనాలు పొందుతారు. ప్రయాణాలవల్ల లాభం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యమైన పనులు స్నేహితుల సహాయంతో పూర్తవుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఓర్పు పాటిస్తే అంతా మంచి జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+