ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది!
జ్యోతిష శాస్త్రంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా పిలుస్తారు. సూర్యుడు గౌరవానికి ఆత్మకు శక్తి ప్రభుత్వ ఉద్యోగాలకు తండ్రికి ప్రతీకగా చెబుతారు. అటువంటి సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీన రాశి మార్పు చేయబోతున్నాడు. ఏ రాశిలో అయినా సూర్యుడు నెలరోజుల పాటు సంచారం చేస్తాడు ఆ తర్వాత మరొక రాశిలోకి వెళతాడు. ఇక ఏప్రిల్ మాసంలో 14వ తేదీన సూర్య సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.
మేష రాశిలోకి సూర్య సంచారం
ఏప్రిల్ 14వ తేదీన ఉదయం తొమ్మిది గంటల 38 నిమిషాలకు మేష రాశిలోకి ప్రవేశించే సూర్యుడు మే 15వ తేదీ వరకు మేషరాశి లోనే ఉంటాడు. సూర్యుడు తన ఉచ్ఛరాశి అయిన మేష రాశిలోకి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారు అదృష్ట జాతకులు అవు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
సూర్యుడు తన ఉచ్చ రాశి అయిన మేష రాశిలోకి సంచారం చేయడం వల్ల మేష రాశి జాతకులకు కలిసొస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు ఏ పని చేసిన ప్రయోజనాలను పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పనిలో సంతోషంగా గడుపుతారు. మీ పని ప్రశంసించబడుతుంది.
సింహరాశి
సింహ రాశి జాతకులకు సూర్యుడు తొమ్మిదవ ఇంట్లో సంచారం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ప్రయాణ యోగం ఉంది. కెరీర్ లోను వీరికి సక్సెస్ దొరుకుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ సమయం సింహ రాశి వారికి అదృష్ట సమయం.
తులారాశి
తులా రాశిలో సూర్యుడు ఏడవ గృహంలో ఉండడంవల్ల భర్తకు వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. వైవాహిక బంధంలో సంతోషం ఉంటుంది. మీరు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఇది అన్ని విధాలుగా తులా రాశి జాతకులకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
ధనుస్సు రాశి
మేష రాశిలోకి సూర్య సంచారం ధనుస్సు రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. పిల్లలతో సంతోషంగా ఉంటారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు.
మకరరాశి
మకర రాశి జాతకులకు సూర్య సంచారం కలిసి వస్తుంది. మేషరాశిలో సూర్య సంచారం సమయంలో మకర రాశి జాతకులు ఏ పని చేసినా అదృష్ట లక్ష్మి వరిస్తుంది.వృత్తి వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఇది వీరికి మంచి కాలం.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications