త్వరలో ఈ రాశులవారిపై మండిపడే సూర్యుడు.. కుటుంబ కలహాలు, ఆర్ధిక నష్టాలు!

గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ప్రతినెల తన రాశిని మార్చుకుంటూ సంచారం చేస్తాడు. ప్రస్తుతం వృశ్చికరాశిలో ఉన్న సూర్యుడు ఈ నెల 15వ తేదీన తన రాశి మార్చుకోబోతున్నాడు. డిసెంబర్ 15వ తేదీన వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలోకి సూర్య సంచారం కొనసాగుతుంది . దీని కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం వస్తే మరికొన్ని రాశుల వారికి దురదృష్టం రాబోతుంది. సూర్య సంచారం కారణంగా నష్టపోయే రాశులేమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
ధనుస్సురాశిలో సూర్య సంచారం వృషభ రాశి జాతకులకు ప్రతికూల ఫలితాలను తెస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు ఆర్థిక నష్టాలను చూస్తారు. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, మనస్పర్ధలు వస్తాయి. ఈ నెల రోజులు వృషభ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవభంగానికి కూడా అవకాశం ఉంది.

sun transit into sagittarius will give these zodiac signs difficulties and financial losses

కర్కాటక రాశి
సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల కర్కాటక రాశి జాతకులకు అనేక సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక యాత్రలు చేయడం మంచిది. ఈ సమయంలో అనేక బాధలు పడాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించాలి.

కన్యారాశి
సూర్యుడు తన రాశిని మార్చుకోవడం వల్ల కన్యా రాశి వారికి ఆరోగ్య సమస్యలు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయి. ముఖ్యంగా కన్యరాశి జాతకులు ఉదర సంబంధిత సమస్యలతో బాధపడతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి నష్టాలు వస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

మకర రాశి
సూర్యుడు తన రాశిని మార్చుకొని ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల మకర రాశికి చెందిన వారు వ్యాపారంలో తీవ్రంగా నష్టపోతారు. మకర రాశి వారు మానసికంగా ఒత్తిడిలో కూరుకుపోతారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా వారిని తీవ్ర ఇబ్బంది పెడతాయి.. ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండాలి. లేకపోతే సమస్యలు మరింత జటిలమవుతాయి.

కుంభరాశి
సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించటం వల్ల కుంభరాశి వారి పైన ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కుంభరాశి జాతకులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులకు అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలోనూ కార్యాలయంలోనూ గౌరవం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+