2026 జనవరిలో డబుల్ సూర్య సంచారం.. ఈ రాశులవారికి స్వర్ణ యోగం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహాల రాజు అయిన సూర్యుడు జనవరి మాసంలో రెండు సార్లు సంచారం చేయబోతున్నాడు. జనవరి 11వ తేదీన సూర్యుడు మొదట తన సొంత నక్షత్రమైన ఉత్తరాషాడ నక్షత్రం లోకి ప్రవేశిస్తాడు.

జనవరిలో రెండు సార్లు సూర్య సంచారం
ఆ తర్వాత శని పాలించే రాశి అయిన మకర రాశిలోకి సూర్యుడు సంచారం చేస్తాడు. దీంతో జనవరి మాసంలో రెండు సార్లు సూర్య సంచారం జరుగుతుంది. సూర్య సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఆయా రాశుల వారు సూర్య సంచారం కారణంగా లబ్ధిని పొందుతారు. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

Sun Transit January Double Sun Transit Brings Luck to These Zodiac Signs

మేషరాశి
సూర్య సంచారం మేషరాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా సూర్యుడు ఈ సంచార సమయంలో వర్తక వాణిజ్యాలు చేసుకునే వారికి గణనీయమైన పురోగతిని ఇస్తాడు ఉన్నతాధికారుల నుండి మద్దతుని ఇస్తాడు. మేషరాశి వారి గౌరవం పెరుగుతుంది. కెరీర్ మరియు విద్యలో మేషరాశి వారు మంచి అవకాశాలను చూస్తారు. సూర్యసంచారంతో మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రమోషన్లు వస్తాయి. అన్ని విధాల ఇది మేషరాశి వారికి కలిసి వస్తుంది.

ధనుస్సు రాశి
సూర్య సంచారం ధనుస్సు రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. సూర్య సంచారం ధనుస్సు రాశిలో జనవరిలో సంపద గృహంలో జరుగుతుంది. అందువల్ల ధనుస్సు రాశి జాతకులు ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీ గౌరవం, విశ్వాసం పెరుగుతాయి. కెరీర్లో విజయం సాధిస్తారు. పనిలో గుర్తింపు దొరుకుతుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

సింహరాశి
సూర్య సంచారం జనవరి మాసంలో సింహరాశిలో 6వ ఇంటి గుండా వెళ్తున్న కారణంగా ఇది సింహ రాశి వారికి అదృష్ట కాలంగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు కోర్టు కేసులలో విజయాలు సాధిస్తారు. రహస్య శత్రువులను జయిస్తారు. మీలో ధైర్యం మరియు శౌర్యం పెరుగుతుంది. విజయానికి నూతన మార్గాలు తెరుచుకుంటాయి. పనిలో పదోన్నతి పొందే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+