ఏప్రిల్ లో వీరికి సంపదల ప్రకాశాన్ని ఇస్తానని మాటిచ్చిన సూర్యుడు
ఏప్రిల్ నెలలో అనేక పెద్ద గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చుకోబోతున్నాయి. 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో గ్రహాల పరివర్తన అన్ని రాశుల వారి జీవితాలలోనూ గణనీయమైన మార్పులకు కారణమవుతున్నాయి. ఏప్రిల్ నెలలో మీన రాశిలో శుక్రుడు ప్రత్యక్ష సంచారం చేయబోతున్నాడు. మేషరాశిలో శని మరియు నెఫ్యూన్ కలయిక జరగబోతుంది. ఇక బుధుడు తిరోగమన సంచారం చేయబోతున్నాడు.
ఏప్రిల్ 14న మేషరాశిలో సూర్యుడు
ముఖ్య గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తాయి. మరికొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని కూడా కలిగిస్తాయి. ఇక ఏప్రిల్ నెలలో సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశించి మే నెల వరకు అక్కడే ఉంటాడు. సూర్యుడు మేషరాశిలో ఏప్రిల్ 14వ తేదీన ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారు సంతోషంతో పాటు పురోగతిని పొందుతారు. ఇక ఆ రాశుల వారు ఎవరు అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

కుంభరాశి
ఏప్రిల్ నెలలో సూర్య సంచారం కుంభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కుంభరాశి జాతకులు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. నూతన అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారు అద్భుతమైన లాభాలను అందుకుంటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఇది కుంభరాశి వారికి అదృష్ట సమయం.
మిధున రాశి
మిధున రాశి వారికి ఏప్రిల్ మాసంలో సూర్య సంచారం కలిసి వస్తుంది. మీరు ప్రతి రంగంలోనూ విజయాలను సాధిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి కొత్త అవకాశాలు వస్తాయి. విదేశాలలో పనులు చేసే వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఇది మిధున రాశి వారికి కలిసొచ్చే కాలం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు ఏప్రిల్ నెలలో సూర్య సంచారం కారణంగా కలిసి వస్తుంది. వీరు ఈ సమయంలో ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. కెరీర్ పరంగానూ కర్కాటక రాశి జాతకులు మంచి ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి. కర్కాటక రాశి జాతకులు కుటుంబ పరంగాను మంచి ప్రయోజనాలను పొందుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications