నవరాత్రుల తర్వాత వీరి అదృష్టం ప్రకాశించేలా, సంపన్నయోగం ప్రకటించిన సూర్యుడు
జ్యోతిష్య శాస్త్రంలో సూర్యభగవానుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు తన సంచారం ద్వారా అనేక రాశుల వారికి శుభయోగాలను, కొన్ని రాశుల వారికి అశుభయోగాలను కలిగిస్తున్నాడు. ఈ నవరాత్రుల తర్వాత సూర్యుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. సూర్యుడు తన శత్రువు రాశి అయిన తుల రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తులా రాశికి శుక్రుడు అధిపతి.
శత్రు రాశిలో సూర్యుడు
సూర్యుడు శుక్రుడికి వైరి గ్రహం కారణంగా శత్రు రాశిలో సూర్యుడు సంచారం కొన్ని రాశుల వారికి ఆర్ధిక ప్రయోజనాలు కలిగిస్తుంది. 2024 సంవత్సరంలో అక్టోబర్ మూడవ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు నవరాత్రులు నిర్వహిస్తారు. ఇక సూర్యుడు తులా రాశి సంచారం నవరాత్రుల తర్వాత అక్టోబర్ 17వ తేదీన జరుగుతుంది. తులారాశిలో సూర్య సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి కలిసొస్తుంది.

సూర్య సంచారంతో కలిసొచ్చే రాశులు
సూర్యుడు అక్టోబర్ 17వ తేదీన ఉదయం ఏడు గంటల 52 నిమిషాలకు తులా రాశిలో ప్రవేశిస్తాడు. తులా రాశిలో సూర్య సంచారం కలిసి వస్తుంది. మేషరాశి, మిధున రాశి, వృషభ రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి వారికి తులారాశిలో సూర్య సంచారం కారణంగా అదృష్టం ప్రకాశిస్తుంది. వీరికి అన్నింట విజయాలు చేకూరుతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి.
మేష రాశి
తులా రాశిలో సూర్యసంచారం మేషరాశి జాతకులకు శుభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు వర్తక వ్యాపారాలలో లాభాలను పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి పురోగతి కనిపిస్తుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఇది మేష రాశి వారికి కలిసొచ్చే కాలం.
వృషభరాశి
తులారాశిలో సూర్యసంచారం వృషభ రాశి జాతకులకు ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు ఏ పని చేసినా కలిసొస్తుంది. వీరికి ఆశాజనకమైన ఫలితాలు అందుతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో వృషభ రాశి జాతకులు రాణించగలుగుతారు.
మిధున రాశి
సూర్య సంచారం మిధున రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు అన్నింట విజయాలను పొందుతారు. వీరికి ఈ సమయంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.
కుంభరాశి
తులా రాశిలో సూర్య సంచారం కారణంగా కుంభరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో కుంభరాశి జాతకులు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి ఫలితాలను పొందుతారు. ఇది కుంభ రాశి వారికి శుభ సమయం.
వృశ్చిక రాశి
తుల రాశిలో సూర్య సంచారం కారణంగా వృశ్చిక రాశి జాతకులు అదృష్టవంతులుగా మారుతున్నారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఏ పని చేసిన విజయం వరిస్తుంది. ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. ఉద్యోగం వ్యాపారం చేసేవారు రాణించగలుగుతారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications