వృషభరాశిలో సూర్య సంచారంతో ఈ రాశులవారికి పంట పండుతుంది!
వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సూర్యుడు ప్రతినెలా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు. గ్రహాలకు అధిపతి గా భావించే సూర్యుడు ప్రస్తుతం మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు మే 15వ తేదీన గురువారం నాడు వృషభ రాశిలోకి సంచరిస్తాడు. జూన్ 14వ తేదీ వరకు సూర్యుడు వృషభ రాశి లోనే ఉంటాడు.
వృషభరాశిలో సూర్య సంచారం
ఆపై జూన్ 15వ తేదీన మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు వృషభ రాశిలోకి సంచరించడం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. వీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. సూర్యుని కటాక్షంతో వీరు వృత్తిపరమైన విజయాలను సాధిస్తారు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
వృషభ రాశిలో సూర్య సంచారం మిధున రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మిధున రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. పెట్టుబడి పైన మంచి రాబడి వస్తుంది. ఆర్థికంగా మిధున రాశి వారు మంచి ప్రయోజనాలను పొందుతారు.
కన్యారాశి
కన్యారాశిలో పదవ ఇంట్లో సూర్య సంచారం కారణంగా కన్యారాశి జాతకులకు కలిసొస్తుంది. వచ్చే నెలలో కన్యా రాశి జాతకులు సూర్యుని కారణంగా వృత్తిపరమైన విజయాలను సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి.
సింహరాశి
వృషభ రాశిలో సూర్య సంచారం సింహరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఈ సమయంలో సింహరాశి వారు ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఇది సింహ రాశి వారికి అదృష్ట సమయం.
కుంభరాశి
సూర్య సంచారం కుంభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. సూర్యుడి సానుకూల ప్రభావంతో పైఅధికారుల నుండి సహకారం లభిస్తుంది. ఆర్థికంగానే కాకుండా వృత్తిపరంగా పురోగతి సాధ్యమవుతుంది. కుంభ రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుంభ రాశి జాతకులు కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications