కుంభరాశిలో బుధాదిత్య రాజయోగం.. ఈ రాశులపై అదృష్ట వర్షం
గ్రహాలు నిర్దేశిత సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేసినప్పుడల్లా కొన్ని సానుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. తాజాగా సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఇది శనిదేవుడి రాశి. ఈనెల 20వ తేదీన బుధుడు కూడా కుంభరాశిలోకి రానున్నాడు. సూర్యుడు, బుధుడి కలయికవల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. నాలుగు రాశులవారికి ఈ యోగం అత్యంత శుభప్రదంగా ఉండనుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.
కన్యా రాశి
బుధాదిత్య రాజయోగం వీరికి లాభాలను కలిగిస్తుంది. పనిచేసేచోట బాధ్యతలు పెరగడంతోపాటు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడటంతోపాటు నలుగురికి సాయం చేసే స్థితికి చేరుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి.

మకరరాశి
వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఆర్థికంగా పురోగమించడానికి ఇది ఉపయోగపడుతుంది. కోరికలన్నీ నెరవేరడంతోపాటు అదృష్టం తోడుగా ఉంటుంది. దీనివల్ల అనుకున్న పనులను సులభంగా పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఊహించనిరీతిలో మద్దతు లభించడంతో ఆత్మవిశ్వాసంతోపాటు ధైర్యంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అయితే ఇవి కూడా ఆర్థికంగా లాభసాటిగా ఉంటాయి.
మేష రాశి
బుధాదిత్య రాజయోగంతో ఈ రాశికి చెందిన వ్యాపారులు, ఉద్యోగులు, వృత్తిరంగాల్లో ఉన్నవారికి లాభాలున్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. గతం నుంచి వేధిస్తున్న రోగాలు దూరమవడంతోపాటు మంచి ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
మిథున రాశి
ఆర్థిక పరిస్థితి గతంకంటే ఎంతో బాగుంటుంది. ఉద్యోగం చేయాలనే కోరిక నెరవేరుతుంది. కెరీర్ పరంగా ఇప్పటివరకు ఎదుర్కొంటున్న అడ్డంకులను అధిగమిస్తారు. ఒకరకంగా బుధాదిత్య రాజయోగం ఈ రాశివారికి అద్భుతంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications