జులై 16 నుండి ఈ రాశులవారికి మహారాజయోగం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గ్రహాలకు రారాజు అయిన సూర్యుడు రాశి పరివర్తన అన్ని రాశుల వారికి సానుకూల లేదా ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. జులై 16వ తేదీన సూర్యుడు మిధున రాశి నుండి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. సూర్య సంచారం లబ్ధిని చేకూర్చే ఆ రాశులేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశి
సూర్య గోచారం కారణంగా మేష రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసొస్తుంది. ఉద్యోగాలు చేసేవారు ఉన్నతాధికారుల నుండి మద్దతు పొందుతారు. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు.

వృషభరాశి
సూర్యసంచారం వృషభ రాశి వారి జీవితంలో మంచి మార్పులకు కారణం అవుతుంది. ఈ సమయంలో మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. పనిచేసే చోట ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఈ సమయంలో లాభాలకు ఎక్కువ అవకాశం ఉంది. తల్లి నుండి సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది.. కుటుంబ సౌఖ్యాలు, సౌకర్యాలు విస్తరిస్తాయి.
మిధునరాశి
సూర్య సంచారం కారణంగా మిధున రాశి జాతకులకు ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం. ఈ సమయంలో కుటుంబం నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా బలోపేతం అవుతారు.
సింహరాశి
సూర్య సంచారం కారణంగా సింహ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో మార్పుతో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారవలసి వస్తుంది. ఈ సమయంలో ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వాహన యోగం కలుగుతుంది. తల్లి నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications