సింహరాశిలోకి సూర్య గోచారం.. ఆగస్టులో వీరి ఇంట సంపదల ప్రకాశం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు రాశుల గమనం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ఆగస్టు మాసంలో 16వ తేదీన సూర్య భగవానుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు.
సూర్య సంచారంతో అదృష్ట రాశులు
సుమారు ఏడాది తర్వాత సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలో సంచరించబోతున్నాడు.ఈ సూర్య సంచారం ముఖ్యంగా కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు ఊహించని అదృష్టాన్ని పొందుతారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల మేష రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకుల ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో మేష రాశి జాతకులకు నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు లభిస్తాయి. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
సింహరాశి
సింహరాశిలో సూర్యసంచారం సింహ రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో సింహరాశి వారి ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. కుటుంబం నుండి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పనిలో అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. పిల్లల వల్ల జీవితంలో సంతోషం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది సరైన సమయం.
కన్యారాశి
సూర్య సంచారం కన్యారాశి వారికి సంతోషాన్ని ఇస్తుంది. కన్య రాశి జాతకులు ఈ సమయంలో మంచి ఆదాయాన్ని సంపాదిస్తారు. ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో పిల్లలు చదువులు సానుకూలంగా సంతోషకరమైన ఫలితాలను ఇస్తాయి. పిల్లలనుంచి శుభవార్తలు అందుకుంటారు. ఇంట్లో ఏవైనా మతపరమైన కార్యక్రమాలను చేస్తారు.
ధనుస్సు రాశి
సూర్య సంచారం ధనస్సు రాశి జాతకులకు లబ్ధిని చేకూరుస్తుంది. ఈ సమయంలో వీరి సంపద పెరుగుతుంది. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. పనిలో అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి సూర్యసంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ధనస్సు రాశి జాతకులు అదృష్టవంతులుగా మారుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications