అక్టోబర్ 17వరకు వీరికి డబ్బుల మూటలను అందించే బిజీలో సూర్య కేతువులు!
అక్టోబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశుల వారికి సానుకూల ప్రతికూల ఫలితాలను కలిగిస్తున్నాయి. అక్టోబర్ మాసంలో అక్టోబర్ 17 వ తేదీ వరకు సూర్య, కేతువులు కన్యా రాశిలో కలిసి ఉండటం కారణంగా కొన్ని రాశులవారికి అక్టోబర్ మాసం ప్రధమార్ధం అంటూ అదృష్టాన్ని ఇస్తుంది.
అక్టోబర్ 17 వరకు సూర్య కేతు సంయోగం
సెప్టెంబర్ 16వ తేదీ రాత్రి 7.20 నిమిషాలకు సూర్యుడు కన్యరాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడు కన్యరాశిలోకి ప్రవేశించిన తరువాత అప్పటికే కన్యారాశిలో ఉన్న కేతు గ్రహంతో సూర్య సంయోగం జరిగింది. ఈ సూర్య కేతు సంయోగం అక్టోబర్ 17 వరకు కొనసాగుతుంది. దీనివల్ల కొన్ని రాశులవారికి విశేషమైన ఫలితాలు వస్తాయి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
సూర్యుడు మరియు కేతువుల సంయోగం మేషరాశి జాతకులకు శుభాలను కలిగిస్తుంది . సూర్య కేతు సంయోగం కారణంగా అక్టోబర్ 17 వరకు మేషరాశి జాతకులకు అన్ని విధాలుగా కలిసివస్తుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వీరు వృత్తి వ్యాపారాలలో అపారమైన విజయాలను పొందుతారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. మేషరాశి వారు ఏ పని చేసినా మంచి ఫలితం వస్తుంది.
వృషభ రాశి
సూర్య కేతువుల సంయోగం కారణంగా వృషభ రాశి వారికి అక్టోబర్ 17 వరకు తిరుగుండదు. వృషభ రాశి వారు ఈ సమయంలో ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక లాభాలను పొందడానికి వృషభ రాశి వారికి ఇదే సరైన సమయం. ఉద్యోగం చేసే చోట ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం.
సింహరాశి
అక్టోబర్ 17 వ తేదీ వరకు సూర్యుడు మరియు కేతువు, సంయోగం సింహ రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఆర్థికంగా ఈ సమయంలో మరింత పురోగతిని సాధిస్తారు. సింహరాశిలో జన్మించిన వ్యాపారవేత్తలకు ఇది వర్తక వ్యాపారాలు చేయడానికి అనుకూలమైన సమయం. సింహరాశి జాతకులు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తారు. అప్పులన్నీ తీర్చుకుని సానుకూల ఫలితాలను పొందుతారు.
ధనుస్సు రాశి
సూర్యుడు మరియు కేతువుల సంయోగం కారణంగా అక్టోబర్ 17వ తేదీ వరకు ధనుస్సు రాశి జాతకులు సత్ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశి వారికి ఈ సమయం ఆర్థిక లాభాలను తీసుకువస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు దొరుకుతాయి. తమ ప్రయాణంలో ఎదురయ్యే అన్ని ఇబ్బందులను అధిగమించి ధనుస్సు రాశి వారు ముందుకు సాగుతారు. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications