ఇంకా 10రోజులు ఈ రాశులకు సంపదల వర్షం కురిపిస్తున్న సూర్య కేతువులు!

అక్టోబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రహాల రారాజు సూర్యుడు, అత్యంత క్రూరమైన గ్రహంగా, నీడ గ్రహంగా పరిగణించే కేతువులు కన్య రాశిలో కలిసి ఉండడం కారణంగా కొన్ని రాశుల వారికి అక్టోబర్ 17వ తేదీ వరకు అదృష్టం కలిసి వస్తుంది.

కన్యా రాశిలో సూర్య కేతు సంయోగం
సూర్యుడు కన్యారాశిలో సెప్టెంబర్ 16వ తేదీన ప్రవేశించిన క్రమంలో అప్పటికే కన్యారాశిలో ఉన్న కేతు గ్రహంతో సూర్య సంయోగం జరిగింది. ఈ సూర్య కేతు సంయోగం అక్టోబర్ 17వ తేదీ వరకు కొనసాగుతుంది. దీనివల్ల అక్టోబర్ 17వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం ఉంటుంది. మరి ఆ రాశుల వివరాలలోకి వెళితే

Surya Ketu is showering wealth for these zodiac signs for 10 more days

మేషరాశి
సూర్య కేతువుల సంయోగం కారణంగా మేషరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. వర్తక, వ్యాపారాలు చేసేవారికి ఇది అదృష్ట సమయం. ఈ సమయంలో ఆర్థికంగా వీరు పురోగతిని సాధిస్తారు. మేష రాశి వారు ఉద్యోగం చేసే క్రమంలో ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. మేష రాశి వారు ఏ పని చేసిన ఈ సమయంలో మంచి ఫలితం వస్తుంది.

వృషభ రాశి
సూర్య కేతువుల సంయోగం వృషభ రాశి వారికి కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో లాభాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వృషభ రాశి వారికి ఇది ఆర్థికంగా అదృష్టాన్ని ఇచ్చే సమయం.

సింహరాశి
సూర్య కేతువుల సంయోగం అక్టోబర్ 17వ తేదీ వరకు సింహ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది అదృష్ట సమయం. సింహ రాశి జాతకులు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తారు. అప్పుల బాధలు పోయి సంతోషంగా జీవిస్తారు.

ధనుస్సు రాశి
సూర్య కేతువుల సంయోగం కారణంగా అక్టోబర్ 17వ తేదీ వరకు ధనుస్సు రాశి జాతకులకు కలిసొస్తుంది. వర్ధక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ధనస్సు రాశి వారికి ఈ సమయంలో సమాజంలో గౌరవ ప్రతిష్టలు దొరుకుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+