అక్టోబర్ 17వరకు వీరికి ధన నష్టాలు, ప్రమాద హెచ్చరికలు పంపిన సూర్య కేతువులు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రయాణం చేస్తాయి. ఆయా రాశులలో అప్పటికే ఉన్న వేరే గ్రహాలతో సంయోగం చెందుతాయి. ఈ గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం ద్వాదశి రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక 2024 సెప్టెంబర్ లో కన్యరాశిలో సూర్య కేతువుల సంయోగం జరిగిన విషయం తెలిసిందే .సెప్టెంబర్ 16వ తేదీన కన్యరాశిలో సూర్యుడు ప్రవేశించాడు.

సూర్య కేతువుల సంయోగం
అప్పటికే అక్కడ ఉన్న కేతువుతో సూర్యుడు సంయోగం చెందడం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రాగా మరికొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను పొందుతున్నారు. కన్యరాశిలోనే సూర్యుడు కేతువు అక్టోబర్ 17వ తేదీ వరకు కలిసి ఉంటారు. 18 సంవత్సరాల తర్వాత కన్యరాశిలో సూర్యుడు కేతువుల కలయిక తీవ్రమైన ప్రభావాలను చూపించే ఆ రాశులు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Surya Ketu sent these zodiac signs financial losses and danger warnings till October 17

కన్యారాశి
కన్య రాశిలో సూర్యకేతువుల కలయిక వలన కన్య రాశి వారికి అశుభాలు జరుగుతాయి. ఈ సమయం వీరికి చాలా హానికరం గా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలలో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.

గొడవలకు ఆస్కారం .. జాగ్రత్త
అంతేకాదు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మాటలు అదుపులో లేకపోతే గొడవలు జరిగే అవకాశం ఉంది. కన్యారాశి జాతకులకు ఇది పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు. ఎటువంటి గొడవలలోనూ తలదూర్చకుండా ఉండాలి. డబ్బులు ఆదా చేసే అవకాశం తక్కువ. అయినప్పటికీ ఆర్థిక వ్యవహారాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి
సూర్యుడు కేతువుల కలయిక కారణంగా మీనరాశి జాతకులకు ఇబ్బందులు ఉన్నాయి. మీనరాశి జాతకులు ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు ఆస్కారం ఉంది.కుటుంబ శాంతికి విఘాతం కలిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది.

మీనరాశిపై శని సడే సతి ప్రభావం
మీన రాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో క్షీణిస్తుంది. మీనరాశి జాతకులు గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. మీన రాశి వారిపైన ఈ సమయంలో శని సడే సతి ప్రభావం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలలో మీనరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయాల్లో కూడా మీనరాశి జాతకులు అప్రమత్తంగానే ఉండాలి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+