వాస్తు ప్రకారం మెట్లు ఎలా ఉండాలో ఒకసారి పరిశీలించుకోండి.. మీ ఇంట్లో మెట్లు కూడా చూడండి
ఇంటి నిర్మాణం అంటేనే వాస్తుపై ఆధారపడివుంటుంది. మనదేశంలో కచ్చితంగా వాస్తును అనుసరిస్తారు. ఇంటికి ఎంత ప్రాధాన్యముందో, మెట్లకు కూడా అంతే ప్రాధాన్యం వాస్తు ప్రకారం ఉంటుంది. ఇల్లు కట్టుకునేముందు మెట్లు, మేడ ఎక్కడ ఉన్నాయి? ఎలా ఉన్నాయి? ఏవిధంగా రూపుదిద్దుకున్నాయి. ఏదిక్కులో ఉన్నాయనే విషయాలు చాల ప్రధానం. ఇంటి నిర్మాణంకన్నా మెట్ల నిర్మాణంలో లోపంవల్లే కుటుంబ సభ్యులకు కష్టాలు ఎదురవుతాయని వాస్తు శాస్త్రానికి ప్రామాణిక గ్రంథమైన విశ్వకర్మ చెబుతోంది.
మెట్లను వర్తులాకారంలో, ఏటవాలుగా, మిశ్రమ ఆకారంలో, వక్రంగా కడుతుంటారు.
ఏటవాలుగా కట్టిన ఇంట్లో ఎప్పుడూ శుభకార్యాలు జరుగుతంటాయని వాస్తు చెబుతోంది.
వర్తులాకారంలో కడితే ఇంట్లోనివారు ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వక్రంగా కట్టినా ఇవే సమస్యలు ఎదురవుతాయి.

ఏటవాలుగా మెట్లు కట్టి, కొంతదూరం తర్వాత వదిలేసి, మధ్యలో చతురస్రాకారంలో వంపును వదిలేసి మెట్లు కడితే మంచిది.
ఇలాంటి మెట్ల వల్ల సిరిసంపదలకు లోటుండదు.
ప్రశాంతంగా జీవిస్తారు.
సరిసంఖ్యలో మెట్లు ఉండాలి.
దీనివల్ల సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. పురోగతి లభిస్తుంది.
మెట్ల ఎత్తు 18 అడుగులు ఉండొచ్చు.
విశాలంగా నిర్మించుకుంటే అనారోగ్య సమస్యలు రావు.
మెట్లకు రెండువైపులా చిన్న గోడను, లేదంటే పట్టుకోవడానికి వీలుగా చెక్కతో, లేదంటే లోహంతో రైలింగ్ కట్టుకోవాలి.
మెట్లను ఇలా నిర్మించుకోవడంవల్ల ఆ కుటుంబ ప్రగతి శరవేగంగా దూసుకెళుతుంది.
మెట్లను లోపభూయిష్టంగా కట్టకూడదు.
వాస్తుకు విరుద్ధంగా కడితే దరిద్రం నెలకుంటుంది.
ఆర్థిక బాధలు వెంటాడుతుంటాయి.
సరైన ప్రదేశంలో, సరైన విధంగా మెట్లు నిర్మిస్తే అవి కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు బంగారు సోపానాలవుతాయి.
ఇంటి ముందు నుంచి మెట్లు కట్టడం శ్రేయస్కరం కాదు.
చిన్న చిన్న గదులు నిర్మించి అందులో నుంచి మెట్లు నిర్మిస్తే మంచిదే.
మెట్ల నిర్మాణానికి లోతైన పునాదులు అవసరం.
సిమెంట్ తో, రాళ్లతో, చెక్కలతో కట్టాలి.
ఇనుముతో అసలు కట్టకూడదు.
ఇనుముతో కడితే దరిద్ర దేవత తాండవిస్తుంది.












Click it and Unblock the Notifications