రెండు అద్భుత యోగాలతో వీరికి సంపదలను, రాజభోగాలను ప్రకటించిన చంద్రుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా ఏర్పడే యోగాలు కొన్ని రాశుల వారికి శుభాలను చేకూరుస్తున్నాయి. సెప్టెంబర్ 27వ తేదీన శుక్లపక్ష దశమి నాడు చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో అమృత సిద్ధ యోగం ఏర్పడింది. ఈ అమృత సిద్ధయోగంతో కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమయ్యాయి.
రెండు గొప్ప యోగాలు
ఈ అమృత సిద్ధ యోగం శివయోగంతో పాటు ఏర్పడింది. శివయోగంతో పాటు అమృత సిద్ధ యోగం ఏర్పడడం చాలా అరుదుగా జరుగుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చంద్రుడు రాజభోగాలను, సంపదలను ప్రసాదించాడు .మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభరాశి
వృషభ రాశి వారికి అమృతసిద్ధి యోగం కారణంగా సత్ఫలితాలు వస్తాయి. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు అయినా ఎదుర్కునే శక్తి సామర్ధ్యాలను కలిగి ఉంటారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య చోటు చేసుకున్న వివాదాలను పరిష్కరించగలుగుతారు. వృత్తి జీవితంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా ఇది వీరికి కలిసి వచ్చే సమయం.
కుంభరాశి
అమృత సిద్ధియోగం కారణంగా కుంభరాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది . వీరి జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఇష్టమైన వాళ్ళతో మంచి సమయాన్ని గడపగలుగుతారు. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఇది కుంభ రాశి వారికి శుభకాలం.
కర్కాటక రాశి
రెండు ప్రత్యేక యోగాలు కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. గతంలో వీరికి వచ్చిన సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగాలు చేసే వారికి మేలు జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది అనుకూలమైన కాలం.
సింహరాశి
సింహ రాశి వారికి కూడా ఈ సమయం అద్భుతమైన సమయంగా ఉంటుంది. సింహరాశి జాతకులు వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది. ఇది సింహరాశి వారికి కలిసొచ్చే కాలంగా చెప్పొచ్చు .
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ సమయంలో ధనస్సు రాశి వారు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారాలు చేసే వారికి నూతన ప్రాజెక్టులు వస్తాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications