అత్యంత శక్తివంతమైన త్రిగ్రాహి యోగం.. ఈ రాశులవారు ఇప్పుడు పట్టిందల్లా బంగారమే!!
మేషరాశిలో సూర్యుడు, శుక్రుడు, బృహస్పతి వంటి ముఖ్య గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడిన విషయం మీకు తెలిసిందే. శుక్రుడు మేషరాశిలో ప్రవేశించడంతో ఇక అప్పటికే అక్కడ ఉన్న సూర్యుడు, బృహస్పతి, శుక్ర సంయోగంతో త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఈ యోగం ఫలితంగా మే ఒకటవ తేదీ వరకు కొన్ని రాశుల వారు ఏ పని చేసినా కలిసొస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం
మిధున రాశి
త్రిగ్రాహి యోగం కారణంగా మిధున రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వర్తక వ్యాపారాల పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు రావడానికి కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. ప్రతి రంగంలోనూ విజయం సాధించడానికి, శత్రువులను ఓడించడానికి ఇదే సరైన సమయం.

సింహరాశి
సింహరాశి జాతకులకు త్రిగ్రాహి యోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. వీరి ఆర్థిక సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. ఎంతోకాలంగా రాకుండా ఆగిపోయిన డబ్బు ఇప్పుడు చేతికి అందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార పరిస్థితి అద్భుతంగా మారుతుంది. ఏం చేసినా మే ఒకటి లోపు చేస్తే అంతా విజయమే.
కన్యారాశి
త్రిగ్రాహి యోగం కారణంగా మే ఒకటవ తేదీ వరకు కన్యా రాశి జాతకులకు మంచి ఫలితాలు వస్తాయి. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. సంపద పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం సుఖసంతోషాలతో హాయిగా ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి త్రిగ్రాహి యోగం అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. త్రిగ్రాహి యోగం కారణంగా వృశ్చిక రాశి జాతకుల ఆర్ధిక స్థితి మెరుగుపడుతుంది. వీరి శక్తి సామర్ధ్యాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. త్రిగ్రాహి యోగం వీరికి మూడింతల లాభాలను తెస్తుంది. మే 1 వరకు వీరు పట్టిందల్లా బంగారమే.
మకర రాశి
మకర రాశి వారికి త్రిగ్రాహి యోగం అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి చేతికి వస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆరోగ్యం ఈ సమయంలో మెరుగుపడుతుంది. పెండింగ్ బకాయిలు వసూలవుతాయి. భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. మే 1 వరకు వీరు చేసిన ప్రతీ పని విజయవంతం అవుతుంది.
కుంభరాశి
త్రిగ్రాహి యోగం కారణంగా కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ఉన్నతాధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఈ సమయంలో ఏం అనుకున్నా విజయం సాధిస్తారు, కుంభరాశి జాతకులకు బాగా అనుకూలమైన సమయం. ఈ సమయంలో వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications