ధనుర్మాసంలో ఈ రాశులవారికి డబ్బుల మూటలను మోసుకొస్తున్న సూర్యుడు!
గ్రహాలరాజు సూర్యుడు డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రాత్రి 10గంటల 19నిమిషాలకు ధనుస్సురాశిలోకి సంచారం చేస్తాడు. ధనుస్సురాశిలో సూర్య సంచారంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. 2025 జనవరి 14వ తేదీ వరకు సూర్యుడు ధనస్సు రాశి లోనే సంచారం చేస్తాడు. ఆ తరువాత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే సూర్యుడు ధనుస్సు రాశిలో సంచారం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
కర్కాటక రాశి
ధనస్సురాశిలో సూర్య సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతున్నారు. కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఏ పని చేయాలన్నా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి డబ్బు అందుతుంది.

సింహరాశి
సింహ రాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు ధనుస్సు రాశిలో సంచారం చేయడం వల్ల సింహ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. సింహరాశి వారి కుటుంబ జీవితం ఈ సమయంలో సంతోషంగా ఉంటుంది . సింహరాశి జాతకులు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబం నుంచి పూర్తిగా సహకారం అందుతుంది. ఇటీవల వివాహం చేసుకున్న వారికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. వీరి ఆరోగ్యం బాగుంటుంది.
తులారాశి
సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం తులా రాశి వారికి శుభాలను తెస్తుంది. తులా రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన విజయం సాధిస్తారు. కష్టపడి చేసిన పనికి ప్రతిఫలం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. తులా రాశి వారికి సూర్య సంచారం అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని తెస్తుంది.
ధనుస్సు రాశి
ధనస్సురాశిలో సూర్య సంచారం ధనుస్సు రాశి జాతకులకు కూడా కలిసి వస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు అన్ని విషయాలలో విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది. ఈ సమయంలో మీ పని ప్రశంసించబడుతుంది. అయితే ధనుస్సు రాశి జాతకులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.
కుంభరాశి
సూర్య సంచారం కారణంగా కుంభరాశి జాతకులు అదృష్టవంతులుగా మారుతున్నారు. కుంభ రాశి వారి ఆర్థిక పరిస్థితుల్లో వేగంగా మార్పులు వస్తాయి. ఎంతో కాలంగా వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి. సూర్యుని ఆశీర్వాదంతో ఆకస్మిక వృత్తి ప్రయోజనాలను పొందుతారు. వైవాహిక జీవితం లో సంతోషం ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications