డిసెంబర్ లో సూర్య సంచారంతో నక్కతోక తొక్కే లక్కీ ఫెలోస్ వీరే!
వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్న సూర్యభగవానుడు డిసెంబర్ 16 నుండి ధనుస్సు రాశిలో సంచారాన్ని ప్రారంభిస్తాడు. దీంతో డిసెంబర్ 16 నుండి కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
డిసెంబర్ మాసంలో సూర్య సంచారం
సూర్యభగవానుడు ప్రతి నెల రాశి చక్రాలను మారుస్తూ అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాడు. ముఖ్యంగా డిసెంబర్ మాసంలో సూర్య సంచారం మూడు రాశుల వారికి మంచి మెరుగైన, సానుకూల ప్రయోజనాలను చేకూరుస్తున్నాడు. వారికి గణనీయమైన ఆర్థిక లాభాలను తీసుకు వస్తున్నాడు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

సింహరాశి
సింహరాశి జాతకులకు సూర్యభగవానుడి సంచారం చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. సూర్యభగవానుడు మీ రాశిలో అయిదవ ఇంట్లో ప్రవేశిస్తున్న కారణంగా ఈ సమయంలో మీరు మీ పిల్లలకు సంబంధించిన శుభవార్తలను వింటారు. ప్రేమ సంబంధాలలో విజయాలను సాధిస్తారు. విదేశాలలో వ్యాపారం చేసే వారు వివిధ ఒప్పందాలను నుండి గణనీయమైన లాభాలను పొందుతారు. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక స్థిరత్వం వస్తుంది.
మకర రాశి
సూర్యుడి రాశి మార్పు మకరరాశి జాతకులకు అన్ని విధాల సానుకూల ప్రయోజనాలను ఇస్తుంది. సూర్యుడు మకరరాశిలో పదకొండవ ఇంట్లో సంచరిస్తాడు. దీనివల్ల ఈ సమయంలో మకరరాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది. మకరరాశి వారి వైవాహిక జీవితంలో ఆనందాన్ని, శాంతిని పొందుతారు. వివిధ పెట్టుబడుల నుండి ప్రయోజనాలను పొందుతారు. నూతన ఆదాయ వనరులను పొందుతారు. ఇది ఆత్మవిశ్వాసం విజయం మరియు ధైర్యం పెరిగే కాలం.
వృశ్చిక రాశి
సూర్యుడి ధనుస్సు రాశి సంచారం వృశ్చిక రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీ జాతకంలో లగ్న గృహంలో సూర్య సంచారం ఉండడం కారణంగా ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తుంది. అవివాహితులకు మంచి సంబంధాలు వస్తాయి. మీ సామాజిక స్థితి మెరుగుపడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు, వ్యాపార ప్రయత్నాల నుంచి ఊహించని లాభాలు వస్తాయి. వృత్తి జీవితంలో కూడా ప్రతిష్ట పెరుగుతుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications