కేంద్ర దృష్టి యోగంతో నాలుగురోజుల్లో నక్కతోక తొక్కే అదృష్టవంతులు వీరే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో అక్టోబర్ మాసంలో గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. సరిగ్గా నాలుగు రోజులలో గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు యముడితో కలిసి కేంద్ర దృష్టి యోగాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడు. గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు ప్రతి 15 రోజులకు ఒకసారి రాశిని మారుస్తాడు. ప్రతి నెలలోనూ రెండు సార్లు బుధుడు రాశిని మార్పు చేస్తాడు.
కేంద్ర దృష్టి యోగం.. అదృష్టరాశులు
త్వరలో బుధుడు తులా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తులా రాశిలో బుధుడు అక్టోబర్ 24 వరకు ఉంటాడు. ఇక బుధుడు యముడు ఒకరికొకరు 90 డిగ్రీల వద్ద అక్టోబర్ 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 22 నిమిషాలకు కేంద్ర దృష్టి యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ సమయంలో యముడు మకర రాశిలో ఉంటాడు. కేంద్ర దృష్టి యోగంతో మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

వృషభరాశి
వృషభరాశి వారికి బుధ యమ కేంద్ర దృష్టియోగం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో స్నేహితులు, కుటుంబసభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. బుధుడు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి మంచి జీవితాన్ని ఇస్తాడు. బ్యాంకు రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి రుణాలు దొరుకుతాయి. అప్పుల నుండి బయటపడవచ్చు. మీ పోటీదారుల కంటే మెరుగ్గా ఉంటారు. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. కళా, సాహిత్య రంగాలలో ఉన్న వారికి శ్రేయస్సు కలుగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు బుధుడు, యముడి కారణంగా ఏర్పడే కేంద్ర దృష్టి యోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. మీ కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొంటాయి. కర్కాటక రాశి జాతకులకు భవిష్యత్తులో గణనీయమైన ప్రయోజనాలు కలుగుతాయి. తల్లితో సంబంధాలు మెరుగుపడతాయి. స్నేహితుల సహాయంతో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు.
మకర రాశి
మకర రాశి జాతకులకు కేంద్ర దృష్టి యోగం ప్రయోజనాలను చేకూరుస్తుంది. వీరికి నూతన ఉద్యోగ అవకాశాలకు ఆస్కారం ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి గణనీయమైన లాభాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. మకర రాశి వారు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications