త్వరలో శని రాశిలో సూర్యసంచారంతో జాక్ పాట్ కొట్టే రాశులివే!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో గ్రహాల రాజుగా చెప్పబడే సూర్యుడికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సూర్యుడు ప్రతినెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు. ఇక ఫిబ్రవరి నెలలో 13వ తేదీన సూర్యుడు కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు.
కుంభరాశిలో సూర్య సంచారం
సూర్యుడు శని పాలించే రాశి అయిన కుంభ రాశిలోకి సంచారం చేయడం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. సూర్య సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, మరికొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది. ప్రస్తుతం మనం సూర్య సంచారం వల్ల అదృష్ట జాతకులుగా మారుతున్న రాశుల వారు ఎవరు అనేది తెలుసుకుందాం.

మేషరాశి
కుంభరాశి లో సూర్య సంచారం కారణంగా మేషరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు నెలరోజుల పాటు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు . నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇక వర్తక వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడం మేషరాశి వారికి మంచి రాబడిని తీసుకువస్తుంది. మేష రాశి వారి సంపద పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కాలంలో మంచి విజయాలు లభించే అవకాశం ఉంది.
వృషభ రాశి
సూర్య సంచారం కారణంగా వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. వృషభ రాశి వారు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతాలు పెంపు జరుగుతుంది. వ్యాపారాలలో ఊహించని లాభాలను పొందుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు, వృషభ రాశి వారికి వ్యక్తిగత లక్ష్యాలను సాధించడానికి ఇది అనుకూలమైన సమయం.
వృశ్చిక రాశి
కుంభరాశిలో సూర్యసంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి నెలరోజులపాటు అనేక ప్రయోజనాలు వస్తాయి. వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత జీవితం కూడా సాఫీగా సాగుతుంది. ఇది వృశ్చిక రాశి వారి సామాజిక స్థితిని పెంచుతుంది. నూతన గృహాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. వివాహితులకు ఈ సమయంలో కలిసి వస్తుంది. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. జీవితంలో మరింత సంతృప్తిని పొందేందుకు సహాయపడుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications